కాస్త గ్యాప్ తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో ఆడియెన్స్ ముందుకి రాబోతుంది అనుష్క శెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా ఈ వారమే థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా అనుష్క చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే నవీన్ పోలిశెట్టి జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తనకు బాగా నచ్చిందని ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. దీంతో మంచి పాజిటివ్ బజ్‌తో థియేటర్లోకి రాబోతోంది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. అయితే ఇప్పటివరకు అనుష్క శెట్టి ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. కానీ ఫైనల్‌గా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగింది స్వీటి. మీడియాతో ఫోన్ ద్వారానే ఇంటరాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఒకే ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. కానీ ఆడియో ద్వారా మాత్రం సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటోంది స్వీటి.
పెళ్లి, సినిమాలతో పాటు ప్రభాస్ గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. ప్రభాస్‌తో సినిమా ఎప్పుడు చేస్తారు? అన్న ప్రశ్నకు.. ‘మంచి కథ దొరికితే వెంటనే చేస్తాను’ అని చెప్పుకొచ్చింది అనుష్క. దీంతో ప్రభాస్, స్వీటీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పుకొచ్చింది అనుష్క. నా కెరీర్లో చాలా సినిమాలు చేశాను. కానీ ఏ సినిమా ఇవ్వని అనుభూతి ‘మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి’ ఇచ్చింది. నవీన్‌తో కెమిస్ట్రీ అలా వర్కవుట్ అయిందని చెప్పింది. ఇక ఈ సినిమా తర్వాత ‘కథనార్’ అనే మలయాళం సినిమా చేయబోతున్నాను.
దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కించనున్న ఈ సినిమా ఏడు భాషల్లో రానుంది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్‌కే రెండేళ్ల సమయం పట్టింది. జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌మీద రాని థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని అన్నారు. తెలుగులో ప్రస్తుతం కథలు వినే పనిలో ఉన్నాను. ‘బెంగళూరు నాగరత్నమ్మ’ బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలే కాదు నటిగా ఇంకా చాలా ప్రయోగాలు చేయాలనుందని చెప్పుకొచ్చింది అనుష్క.