ఇప్పటం గ్రామస్థులకు హైకోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. ఇటీవల ఈ గ్రామంలో ఇల్లు కూల్చేశారంటూ పవన్… ప్రభుత్వంపై మండిపడిన సంగతి తెలిసిందే. బాధితులకు రూ. లక్ష రూపాయలకు కూడా అందించారు. అయితే…. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో… పవన్ కి ఎదురుదెబ్బ తగిలింది.
ఇంతకీ మ్యాటరేంటంటే… ఇళ్ల కూల్చివేత జరుగుతున్నప్పుడు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించిన ఇళ్ల యజమానులు.. తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని ఆరోపించారు. దీంతో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇక్కడే ప్రభుత్వం అసలు ట్విస్ట్ ఇచ్చింది. తాము నోటీసులు ఇచ్చినట్లుగా ప్రభుత్వం హైకోర్టుకు ఆధారాలు సమర్పించింది. దీంతో ఉన్నత న్యాయస్థానం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది.
ఇళ్ల కూల్చివేత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై తమకు అవగాహన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి.. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధించింది. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయించినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఇళ్ల కూల్చివేతపైన దాఖలైన పిటిషన్ను కొట్టేసింది.