Rashmika మోసం చేసింది.. అయినా వెంట పడుతున్న హీరోలు!
నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. అమ్మడు ఏది చేసిన హాట్ టాపికే. ఈ మధ్య తరచుగా ఏదో ఒక కాంట్రవర్శీలో నిలుస్తునే ఉంది రష్మిక. కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేసే వరకు వెళ్లింది పరిస్థితి. ఇప్పుడు ఏకంగా రష్మిక మోసం చేసిందంటూ.. ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. అయినా కూడా అమ్మడి కోసం బడా బడా హీరోలు పోటీ పడుతున్నారు.
Rashmika:పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది రష్మిక మందన్న (Rashmika). ఆమె క్రేజ్‌ను వాడుకునేందుకు.. మూవీ మేకర్సే కాదు, కమర్షియల్ యాడ్స్ కూడా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది రష్మిక. ఈ క్రమంలో రష్మిక (Rashmika) చేసిన ఓ యాడ్‌తో మరో వివాదంలో చిక్కుకుంది. ఓ ప్రముఖ బర్గర్ బ్రాండ్ కోసం చేసిన యాడ్‌లో.. స్పైసీ చికెన్ బర్గర్‌ని టేస్ట్ చేస్తూ కనిపించింది రష్మిక (Rashmika). ఈ వీడియోని రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. గతంలో రష్మిక (Rashmika) చెప్పిన ఓ మాట ఇప్పుడు కాంట్రవర్శీకి దారి తీసింది. గతంలో తాను వెజిటేరియన్ అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు చికెన్ బర్గర్ తింటూ యాడ్ చేయడం ఏంటి? అంటూ ఆమె పై ఫైర్ అవుతున్నారు నెటిజెన్లు. ఇలా తమని మోసం చేయవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మోసం చేసినా బ్యూటీ అంటున్న కూడా.. రోజు రోజుకి రష్మికకు (Rashmika) బాలీవుడ్లో గట్టి డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే గుడ్ బై, మిస్టర్ మజ్ను చిత్రాలతో బాలీవుడ్లో లక్ చేసుకుంది రష్మిక (Rashmika). ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేశాయి. దాంతో ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాతో బ్రేక్ వస్తుందనే కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే అమ్మడి కోసం బాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలు తమ సినిమాల్లో.. రష్మికనే (Rashmika) కావాలని పట్టుపడుతున్నారట. వీళ్లే కాదు.. మిగతా బాలీవుడ్ హీరోలు కూడా రష్మికనే హీరోయిన్గా తీసుకోవాలని అంటున్నారట. ఈ లెక్కన అమ్మడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి పుష్ప2 రిలీజ్ అయిన తర్వాత.. రష్మిక (Rashmika) రేంజ్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.