»Help The Person Who Saved Saidharam Tej In The Accident
Sai Dharam Tej : ప్రమాదంలో సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన వ్యక్తికి సాయం
సాయి ధరమ్ తేజ్ రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనను కాపాడిన వ్యక్తి గురించి, అతనికి చేసిన సాయం గురించి సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.
టాలీవుడ్(Tollywood) హీరో సాయి ధరమ్ తేజ్(Sai dharam Tej) విరూపాక్ష సినిమా(Virupaksha Movie)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి(megastar Chiranjeevi) మేనల్లుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్(Bike Accident)కు గురై కోలుకున్నాడు. ఆ ప్రమాదం నుంచి సాయి ధరమ్ తేజ్‌ను ఓ వ్యక్తి కాపాడాడు. తాజాగా విరూపాక్ష ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సాయి ధరమ్ తేజ్ తనను కాపాడిన వ్యక్తికి సాయం చేసినట్లు చెప్పుకొచ్చారు.
దుర్గం చెరువు వద్ద బైకుపై వెళ్తూ ప్రమాదాని(Bike Accident)కి గురైన సాయి ధరమ్ తేజ్(sai dharam Tej)కు తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని రోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉండగా వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. తనను హెల్మెటే ప్రాణాలు కాపాడిందని ప్రమాదం రోజు జరిగిన విషయాలను సాయి ధరమ్ తేజ్ గుర్తు చేసుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన తనను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లేలా సయ్యద్ అబ్ధుల్(Sayyad Abdhul) అనే వ్యక్తి కృషి చేసినట్లు తెలిపాడు.
తాను ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సయ్యద్ అబ్ధుల్ ను కలిశానని సాయి ధరమ్ తేజ్(Sai dharam Tej) తెలిపాడు. అతనికి కొంత డబ్బు ఇచ్చి తన ప్రాణం నిలిపిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు. తన ఫొన్ నంబర్ ఇచ్చి ఎప్పుడు ఏ సాయం కావాలన్నా సంకోచించకుండా అడగమని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు తాను మద్యం సేవించలేదని, తనపై వార్తలు ఇష్టం వచ్చినట్లు రాశారని తెలిపారు. విరూపాక్ష మూవీ(Virupaksha Movie) ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని తెలిపారు.