ఈ మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. ముఖ్యంగా ఒక్కో ఫైట్, పాటకు కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు. చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్సీ 15 కోసం ఒక్కో పాటకు, ఫైట్లకు 9, 10 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆ మధ్యలో వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’ కోసం కూడా అంతే మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. ఎప్పుడో మొదలైన ‘హరిహర వీరమల్లు’ పవన్ రాజకీయం కారణంగా రోజు రోజుకి డిలే అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఎట్టకేలకు ఇటీవలె తిరిగి ‘హరిహర వీరమల్లు’ పట్టాలెక్కడంతో కాస్త ఖుషీ అవుతున్నారు మెగాభిమానులు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్లో ఇంకా పవన్ జాయిన్ అవలేదని.. పవన్ డూప్‌తోనే షూట్ చేస్తున్నారని వినిపించింది. కానీ తాజాగా ‘హరి హర వీర మల్లు’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు పవర్ స్టార్. భారీ సంఖ్యలో గుర్రాలు, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడట క్రిష్. ఈ షెడ్యూల్ మరో పదిహేను, ఇరవై రోజులు ఉంటుందని టాక్.
ఈ నేపథ్యంలో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ బడ్జెట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క యాక్షన్ సీన్ కోసమే దాదాపు 8 నుంచి 10కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలోనే హైలైట్ నిలిచేలా ఉంటుందని అంటున్నారు. ఇకపోతే.. ఏ.ఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.