Allu Arjun : బర్త్‌డే బాయ్ బన్నీ ఇంటి దగ్గర ఫ్యాన్స్ హంగామా
పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఇవాళ(4.8.2024). దీంతో అల్లు అర్జున్ ఇంటి ముందు భారీగా అభిమానులు పోగయ్యారు. విషస్ చెబుతూ సందడి చేశారు.
Happy Birthday Allu Arjun :తమ అభిమాన హీరోను దగ్గర నుంచి చూసి హ్యాపీ బర్త్‌డే(Happy Birthday) చెప్పాలని అభిమానులు ఆశ పడ్డారు. దీంతో హైదరాబాద్‌లోని బర్త్ డే బాయ్ బన్నీ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున ఫ్యాన్స్ పోగయ్యారు. ఒకరిపై ఒకరు ఎక్కి ప్రహరీ గోడకు ఉన్న తీగలను పట్టుకుని వేలాడారు. బర్త్‌డే విషెస్ చెబుతూ ఆనందపడ్డారు. ఈ క్రమంలో అక్కడున్న ప్రహారీ గోడ తీగలు తెగిపోయాయి. గత అర్ధరాత్రి నుంచి ఆ ఇంటి ముందు ఇంతే భారీగా సందడి కనిపించడం విశేషం.
అల్లు అర్జున్(Allu Arjun) కూడా మాస్ లుక్‌లో, పుష్ప వాకింగ్ స్టైల్‌తో తన ఫ్యాన్స్ వద్దకు వచ్చి వారిని పలకరించాడు. దీంతో అభిమానులు అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఇక అల్లు అర్జున్ కూడా తన లెఫ్ట్ హ్యాండ్ పైకెత్తి తన అభిమానులను పలకరిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
పుష్ప సినిమాతో పాన్ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్. ఇప్పుడు ఆయన నటించిన పుష్ప2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా నేడు విడుదలై అలరిస్తోంది. ఆదివారం పోస్టర్ సైతం విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.