»Pawan Kalyan Started A Party For Chandrababu There Are Evidences
Pothina Mahesh: చంద్రబాబుకోసమే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాడు.. ఆధారాలు ఉన్నాయి!
ఎన్నికల వేల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీగా మార్పులు జరుగుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ కీలక నేత పోతిన మహేష్ పార్టీని వీడడమే కాకుండా పలు ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని, తన దగ్గర ఆధారాలు ఉన్నట్లు తెలిపారు.
Pawan Kalyan started a party for Chandrababu.. there are evidences
Pothina Mahesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పుంజుకుంది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్‌ను అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక మంది టికెట్ అశించిన నాయకులు పార్టీలు మారుతున్నారు. ఇంకొంతమంది పార్టీలోనే ఉండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాక వెస్ట్ నుంచి జనసేన తరఫున టికెట్ ఆశించిన ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన మహేష్ పార్టీని వీడాడు. అంతే కాదు రాజీనామా చేసిన తరువాత పవన్ కల్యాణ్‌పై, జనసేనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కూటమిలో భాగంగా విశాక వెస్ట్ టీడీపీ సభ్యుడు పోటీ చేస్తున్నారు. టికెట్ వస్తుందని ఆశించిన మహేష్‌కు నిరాశే ఎదురైంది. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన తాను ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ ఎందుకు పెట్టారో, ఎవరి కోసం పెట్టారో జనసేన పార్టీలో 40 లక్షల సభ్యులకు చెప్పాలని పోతిన మహేష్ అన్నారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసం మీరు పార్టీ పెట్టారు అని అన్నారు. ముఖ్యంగా కాపు యువతకు అన్యాయం చేయొద్దని, వారంత అమాయాకులు అని పేర్కొన్నారు. మీరు ఏం చేసినా మీ వెంటే నడుస్తున్న కాపు సామాజిక వర్గాన్ని బలి చేయొద్దని అన్నారు. పార్టీ ఎందుకోసం పెట్టారో తమ దగ్గర ఆధారాలు ఉన్నట్లు తెలిపారు.
చంద్రబాబు కోసమే @PawanKalyan పార్టీ పెట్టాడని నాదగ్గర ఆధారాలు ఉన్నాయి
పవన్ కళ్యాణ్ చేస్తున్న ముసుగు రాజకీయాలను బయట పెట్టేసిన