Pawan Fans: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్!
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ హవా నడుస్తోంది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా రీ రిలీజ్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఖుషి, సింహాద్రి సినిమాలు రీ రిలీజ్ కలెక్షన్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ మేన్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తాయని అంటుంటే.. అంతకుమించి అనేలా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేస్తామని చెబుతున్నాడు బండ్ల గణేష్.
కొత్త సినిమాల సంగతేమో గానీ వాటి రికార్డులు పక్కకు పెట్టి.. రీ రిలీజ్ సినిమాల రికార్డులతో కొట్టుకుంటున్నారు స్టార్ హీరోల అభిమానులు. తమ ఫేవరేట్ హీరోల బర్త్ డేలు వస్తే చాలు.. ఏదో ఒక హిట్ మూవీ రీ రిలీజ్ చేయాల్సిందే. ఇక ఆ సినిమాల నిర్మాతలు కూడా రీ రిలీజ్ చేసి.. భారీ వసూళ్లను కొల్లగొడుతున్నారు. కొందరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆ డబ్బులను చారిటీకి ఇస్తుంటే.. ఇంకొందరు నిర్మాతలే లాభం తీసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ హిట్ మూవీస్ ఖుషి, జల్సా, పోకిరి, అతడు సినిమాలతో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇచ్చారు ఫ్యాన్స్.
ఇక ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా బిజినెస్ మేన్ రీ రిలీజ్ చేయగా భారీ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ సినిమా రీ రిలీజుల్లో రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇలాంటి సమయంలోనే.. గబ్బర్ సింగ్‌ను రీ రిలీజ్ చేస్తామని పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు బండ్లగణేష్. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవర్ స్టార్ ఏ సినిమాను రీ రిలీజ్ చేస్తారని ఓ సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. దానికి రిప్లే ఇస్తూ.. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ రేంజ్ ఏంటో, పవర్ స్టార్ స్టామినాయేంటో గబ్బర్ సింగ్ ద్వారా మరోసారి చూపిస్తాం.. అని ట్వీట్ చేశాడు బండ్ల గణేష్.
దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్.. ఏం వార్త చెప్పారన్నా, అలాగే చేద్దామని రిప్లే ఇచ్చాడు. దీంతో ఇక చూసుకోండి పవర్ స్టార్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూపిస్తామని ట్వీట్స్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. బండ్లగణేష్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా.. 2012లో రిలీజ్ అయింది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర 150 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో పవర్ స్టార్ స్టైల్, కామెడీ ఇప్పటికీ హైలెటే. అందుకే ఇప్పుడు గబ్బర్ సింగ్ రిలీజ్ అయి 11 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే హరీష్ శంకర్, పవన్ కాంబినేషన్ కూడా ఇన్నేళ్లకు రిపీట్ అవుతోంది. ఈ ఇద్దరి క్రేజి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ పై ఉంది.