‘గాడ్ ఫాదర్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. దసరా రోజు విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 38 కోట్లు వసూళ్లను అందుకుంది. ఇక నెక్ట్స్ డే 31 కోట్లు రాబట్టి.. రెండు రోజుల్లో 69 కోట్లు కొల్లగొట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఇక మూడో రోజు కూడా గట్టిగానే వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. అలాగే వీకెండ్ కావడంతో బుకింగ్స్ భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది.
హిందీలోను ఈ సినిమా దుమ్ముదులుపుతోంది. దాంతో అక్కడ ఒక్కసారిగా 600 స్క్రీన్స్ పెంచినట్టు సమాచారం. మొత్తంగా ఈ వీకెండ్ వరకు గాడ్ ఫాదర్ వంద కోట్ల క్లబ్లో చేరడం ఖాయమంటున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది గాడ్ ఫాదర్ టీమ్. ఈ సందర్భంగా ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్‌కు.. మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో బైట్ ద్వారా స్పెషల్‌గా థాంక్స్ చెబుతూ.. పొగడ్తలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. గాడ్ ఫాదర్ ఓటిటి గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకు సొంతం చేసుకుందని టాక్. 50 కోట్లకు పైగానే డిజిటల్ రైట్స్ ఉంటాయని అంటున్నారు. దాంతో ఎనిమిది నుంచి పది వారాల తర్వాతే గాడ్ ఫాదర్‌ను ఓటీటీలోకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. పైగా సినిమా హిట్ అయింది కాబట్టి.. ఓటిటిలోకి లేట్‌గానే రానుందని చెప్పొచ్చు. ఆ లెక్కన డిసెంబర్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.