ఈ మధ్య కాలంలో థియేటర్లోకి వచ్చిన పెద్ద సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. రీసెంట్గా వచ్చిన సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో', మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్', సూపర్ స్టార్ 'జైలర్' సినిమా అని చెప్పొచ్చు. వచ్చే నెలలో మాత్రం థియేటర్లో జాతర జరగబోతోంది. ఏకంగా పది సినిమాల వరకు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి.
Film fair: జూలై 28న ‘బ్రో’ సినిమా రిలీజ్ అవగా.. ఆగష్టు సెకండ్ వీక్‌లో అంటే10, 11 తేదిల్లో జైలర్, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆగష్టు 25న ‘గాండీవధారి అర్జున’, ‘బెదురు లంక’ వంటి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక సెప్టెంబర్‌లో అసలు సిసలైన సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వారానికి రెండు, మూడు సినిమాల చొప్పున మొత్తంగా డబ్బింగ్ సినిమాలతో కలుపుకొని 8 నుంచి 10 సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ముందుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి మూవీ థియేటర్స్‌లోకి రాబోతోంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఖుషి రిలీజ్ కానుంది.
సెప్టెంబర్ 7న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ రిలీజ్ కానుంది. నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా పి.మహేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే రిలీజ్ కానుంది. అదే రోజు మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న థియేటర్లోకి వస్తోంది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 15న రామ్ పోతినేని, బోయపాటి శ్రీను చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు హిట్ సీక్వెల్ టిల్లు స్క్వేర్, విశాల్ మార్కో ఆంటోని రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సలార్ ఎండింగ్లో అసలైన డైనోసార్ రాబోతోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఊరమాస్ ప్రాజెక్ట్ ‘సలార్’ సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇండియాతో పాటు ఇంగ్లీష్ ,జపాన్ భాషల్లో కూడా సలార్ రిలీజ్ కానుంది. అలాగే రాఘవ లారెన్స్ చంద్రముఖి2 కూడా సెప్టెంబర్‌లోనే రానుంది. మొత్తంగా సెప్టెంబర్ నెలలో సినిమాల జాతర జరగబోతోందని చెప్పొచ్చు.