చివరగా భోళా శంకర్‌తో మెప్పించలేకపోయినా మెగాస్టార్ చిరంజీవి.. నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెగా 156, మెగా 157 అనౌన్స్మెంట్స్ ఇచ్చేశాడు. కానీ తాజాగా మెగా 156 పై ఓ ఫేక్ న్యూస్ వైరల్‌గా మారింది.
రీసెంట్‌గానే మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అలగే మెగా 156 అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ మెగా 157 మాత్రం పరుగులు పెడుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతోంది. మూడు లోకాలకు.. పంచభూతాలకు సంబంధించిన కథతో వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో అనుష్క హీరోయిన్గా ఫైనల్ అయిందని టాక్. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు కూడా ఉంటారని తెలుస్తోంది.
అందులో ఒకరిని ఐశ్వర్య రాయ్‌ను అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. మెగా 157 మామూలుగా ఉండదు. అయితే ఇలాంటి వార్తల్లో నిజముందా? లేదా? అనేది పక్కకు పెడితే.. మెగా 156 విషయంలో మాత్రం ఓ ఫేక్ న్యూస్ వైరల్‌గా మారింది. మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటికీ.. దర్శకుడి పేరు ప్రకటించలేదు. కానీ ఈ మూవీని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నారు.
అయితే లేటెస్ట్గా కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. దీంతో.. మెగా 156 ఆగిపోలేదు.. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారని, అతి త్వరలో మూవీ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నట్లు.. మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.