బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ‘RC-16’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ నటిస్తున్నట్లు సమాచారం. నెగిటివ్ రోల్లో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.