ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై హీరోయిన్ శ్రీలీల స్పందించింది. విశాఖలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె.. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టవశాత్తూ జరిగిందని చెప్పింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని.. కానీ జైలు నుంచి విడుదల కావడం సంతోషంగా ఉందని తెలిపింది. రూల్స్ ఫాలో కావడంతోనే ఆయన ఈ స్థాయిలో ఉన్నాడని శ్రీలీల అభిప్రాయపడింది.