బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ ‘సికందర్’. కోలీవుడ్ స్టార్ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈనెల 27న సల్మాన్ ఖాన్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ రోల్.. కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది.