సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే అరెస్ట్ సమయంలో బన్నీ వేసుకున్న టీషర్ట్ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తన టీషర్ట్‌పై హిందీలో ‘ఫ్లవర్ నహీ.. ఫైర్ హే మే’ అని రాసి ఉంది. దాని అర్థం ‘ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’. తాజాగా ఈ పిక్ వైరల్ అవుతుండగా.. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన తగ్గేదేలా అని అల్లు అర్జున్ పరోక్షంగా మెసేజ్ ఇస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.