ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి వెళ్లారు. అక్కడికి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, ఇతరులెవరూ వెళ్లటానికి వీల్లేదని సిబ్బంది ఆయన్ని బయటకు పంపారు. ఇది కాస్తా చర్చకు దారితీయటంలో ఆలయ సిబ్బంది వివరణ ఇచ్చారు. అనుకోకుండా ఇళయరాజా అర్ధ మండపంలోకి వెళ్లారని.. వెంటనే ఆయన్ని అక్కడి నుంచి పంపినట్లు చెప్పారు.