బిగ్‌బాస్ కన్నడకు హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 11 సీజన్ల నుంచి అతడు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. అయితే, వచ్చే సీజన్ నుంచి తాను హోస్ట్‌గా చేయనని సుదీప్ ఇటీవల ప్రకటించాడు. తాజాగా దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తన శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదన్నాడు. మిగిలిన భాషల్లో వచ్చినంత గుర్తింపు కన్నడ షోకు రాలేదని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.