హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొత్త ప్రయత్నాలు చేయకపోతే.. కొత్త విషయాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించింది. తన సినిమాని ఏ భాషలో చూసినా ప్రేక్షకులు ఆ భావోద్వేగాల్ని ఆస్వాదించాలన్నదే తన తపన అని పేర్కొంది. అది దృష్టిలో పెట్టుకునే కథల్ని ఎంపిక చేసుకుంటున్నట్లు చెప్పింది. తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో నటించడాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.