ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు ఫోన్లు చేస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అల్లు అర్జున్ను ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించిన విషయం తెలిసిందే. తాజాగా బన్నీని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫోన్లో పరామర్శించారు. అరెస్టుపై వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే, ఎన్టీఆర్, వెంకటేశ్ సైతం ఫోన్ చేసి బన్నీని పరామర్శించారు.