ఎక్కడో క్లోజ్‌లు తప్పితే ప్రభాస్ అస్సలు షూటింగ్‌లోనే ఉండడని చెబుతున్నారు. భలే కదా. ప్రస్తుతం ప్రభాస్ మూడునాలుగు సినిమాల పనిలో బాగా బిజీగా ఉన్నాడు. కానీ ఒక్క సినిమా వర్క్ అంత కూడా చేయడు. అందుకే ప్రభాస్ కన్నా ప్రభాస్ డూప్ బాగా బిజీగా ఉన్నాడు.
డూప్‌ల ప్రపంచం ఎప్పుడో ప్రారంభం అయిందనుకోండి. ఎన్టీఆర్, ఎఎన్నార్ డబుల్ రోల్ సినిమాలు చేసినప్పుడు మొదలైంది. అలాగే గుర్రాలమీద ఫైట్లు, లాంగ్ జంప్‌లు, లాంగ్ షాట్స్‌లో కష్టమైన ముమెంట్స్ ఇలాటివాటికి ఖచ్చితంగా డూప్‌లను వాడేవారు. ఫైట్లలో కష్టమైన ముమెంట్స్ అయినా సరే డూప్ వద్దని తానే చేస్తానని, ప్రాణాలకి తెగించి, ఒంటినిండా దెబ్బలు కూడా తగిలించుకుని మరీ హీరోగా ఎదిగిన తొలి హీరో మెగాస్టార్ చిరంజీవి.
తర్వాత రోజులలో డబుల్ రోల్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయి ఇద్దరు చిరంజీవులు కాదు, ముగ్గురు చిరంజీవులను కూడా ఏకకాలంలో తెరమీద చూపించగలిగారు. ఆడియన్స్ ధ్రిల్ అయిపోవడం మొదలుపెట్టారు. అదే రాముడు భీముడు సినిమా టైంకి టెక్నాలజీ అంతగా వేళ్ళూనుకోలేదు. అందుకే క్లైమాక్సులో ఇద్దరు ఎన్టీఆర్‌లు ఒకే ప్రేమ్‌లో కనిపించినప్పుడు అందులో ఒక ఎన్టీఆర్‌కి బదులు అప్పుడప్పుడే నటుడిగా ఎదుగుతూ, ఎన్టీఆర్‌లా కొంచెం కనిపించే కైకాల సత్యనారాయణని పెట్టేశారు. ఎన్టీఆర్ కాదు, కైకాల సత్యనారాయణే అని తెలిసిపోతున్నా కూడా, ఆడియన్స్ పెద్ద అభ్యంతరపడలేదు. రాముడు భీముడు సెన్సేషనల్ హిట్ అయింది. అది వేరే కథ.
కానీ ఇప్పుడు ఎలా తయారైందంటే అంతా మాయ. ఫోజు. బిల్డప్. గ్రాఫిక్స్ వచ్చాక హీరోలు, హీరోయిన్లు కూడా బడాయి పోతున్నారు. వాళ్ళ కోసమని డూప్‌లు తయారయ్యారు. వాళ్ళకి వేరేగా రెమ్యూనరేషన్లు. నిర్మాతకి అదనపు భారం. సినిమా హిట్ అయితే ఫరవాలేదు. సినిమా తేడా వచ్చిందంటే అంతే సంగతులు, చిత్తగించవలెను.
మిగతావాళ్ళని పక్కనబెట్టి, ప్రభాస్ మరీ ప్రత్యేకం. ఏవో ఎక్కడో తప్పితే ఎన్నో షాట్లలో మనం చూసేది ప్రభాస్‌ని కాదు. ప్రభాస్ డూప్‌ని. ఎక్కడో క్లోజ్‌లు తప్పితే ప్రభాస్ అస్సలు షూటింగ్‌లోనే ఉండడని చెబుతున్నారు. భలే కదా. ప్రస్తుతం ప్రభాస్ మూడునాలుగు సినిమాల పనిలో బాగా బిజీగా ఉన్నాడు. కానీ ఒక్క సినిమా వర్క్ అంత కూడా చేయడు. అందుకే ప్రభాస్ కన్నా ప్రభాస్ డూప్ బాగా బిజీగా ఉన్నాడు. ఓ షూటింగ్లో ప్రభాస్ వచ్చేశాడు. గంటయినా, రెండు గంటలయినా కూడా డూప్ రావడం లేదు. ప్రభాస్ సహనం చచ్చిపోయింది. ఇంత పెద్ద హీరోని నేనే వచ్చేశాను, ఆఫ్టరాల్ నా డూప్ ఇంకా రాకపోవడమేమిటి అని ప్రభాస్ కొంబెం టెంపర్ లూజ్ అయిన పరిస్థితి వచ్చింది. మరికొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ప్రభాస్ డూప్గారు లొకేషన్‌కి వచ్చారు. ఏంటీ లేటు అని ప్రభాస్ కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. దానికి ప్రభాస్ డూప్ కామ్‌గా సమాధానం చెప్పాడు. ఏం చెయ్యమంటారు సార్, మీ సినిమాల వర్కే చేసి వస్తున్నా అని చెప్పగానే ప్రభాస్ ఖంగు తిన్నాడంట. అదీ వరస.