పఠాన్, జవాన్ సినిమాలతో వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చాడు షారుఖ్ ఖాన్. ఇక ఇప్పుడు డంకీ సినిమాతో మరో వెయ్యి కోట్లు రాబట్టి.. హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా డంకీ నుంచి డ్రాప్3 రిలీజ్ చేశారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ డంకీ. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజకుమార్ హిరాని తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. సలార్‌కు పోటీగా డిసెంబర్ 21న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే డంకీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. డ్రాప్ వన్ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేయగా.. డ్రాప్ 2 పేరుతో లుట్ పుట్ గయా సాంగ్ రిలీజ్ చేశారు. ఇక తాజాగా డ్రాప్ 3 పేరుతో మరో సాంగ్ రిలీజ్ చేశారు. ‘నిక్లే థే కభీ హమ్ ఘర్సే’ అంటూ సాగే ఈ సాంగ్ షారుఖ్ ఖాన్ ఫేవరెట్ సాంగ్. సోనూ నిగమ్ పాడిన ఈ పాటను ప్రీతమ్ కంపోజ్ చేశాడు. జావెద్ అక్తర్ ఈ పాటకు లిరిక్స్ అందించాడు.
ఇంటి నుంచి దూరంగా ఉంటూ తమ ఇంటిని మిస్ అవుతున్నామని ఫీలయ్యే ప్రతి వ్యక్తి మనసును తాకేలా ఈ పాట ఉంది. డంకీ ఎమోషలన్ టచ్‌గా ఈ సాంగ్ ఉందనే చెప్పాలి. ఈ లేటెస్ట్ డ్రాప్ గురించి చెబుతూ షారుక్ ఖాన్ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టాడు. ‘ఇవాళ ఎందుకో నా మనసుకు తోచింది.. ఈ పాటను మీతో షేర్ చేసుకుంటున్నాను. రాజు, సోనూ పేర్లు వింటే మన వాళ్లే అన్న భావన కలుగుతుంది.
ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ పాట కూడా మన వాళ్లదే.. మన ఇంట్లోవాళ్ల జ్ఞాపకాలది.. మన మట్టిది.. మన దేశం ఒడిలో ఓ రకమైన హాయి దొరుకుతుంది.. మనమందరం ఎప్పుడో ఒకసారి ఇంటి నుంచి, ఊరి నుంచి, పట్టణం నుంచి దూరంగా మన జీవితం కోసం వెళ్తాం.. కానీ మన మనసులు మాత్రం ఇంట్లోనే ఉండిపోతాయి. డంకీలో నా ఫేవరెట్ సాంగ్ ఇది’ అని షారుఖ్ తెలిపారు. ఇకపోతే.. డంకీ రిలీజ్ టైం దగ్గర పడడంతో.. త్వరలోనే ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.