Relangi Narasimha Rao: సినిమా ఇండస్ట్రిలో నా సెకండ్ వైఫ్ ఎవరో తెలుసా.?
కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ అవడానికి వచ్చిన రేలంగి నరసింహారావు ఎలా డైరెక్టర్‌గా మారారో, తరువాత కామెడి దర్శకుడిగా ఎలా మారాడో లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Director Relangi Narasimha Rao Exclusive Interview, Rajendra Prasad
Relangi Narasimha Rao: కామెడీకే(Comedy) కితకితలు పెట్టే ఎన్నో సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ రేలంగి నరసింహారావు(Relangi Narasimha Rao). ఆయన ఇండస్ట్రి ప్రస్థానాన్ని హిట్ టీవీ ప్రేక్షకులతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు(dasarinarayanarao) శిష్యుడిగా ఎన్నో సినిమాలకు పనిచేసిన తరువాత సొంతంగా డైరెక్టర్ అయ్యానని అన్నారు. అయితే తాను మొదట సీరియస్ డైరెక్టర్ అవుతానని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే కామెడీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్‌గా ముద్రపడిందని తెలిపారు. ఇక చంద్రమౌళి(Chandramouli), రాజప్రసాద్ల(Rajendra Prasad)తో అన్ని సినిమాలు చేసినందుకు తనకు సినిమా పరిశ్రమలో ఓ పేరుతో పిలిచేవారని పేర్కొన్నారు. 75కు పైగా చిత్రాలను తెరకెక్కించిన రేలంగి నర్సింహారావు హీరో రాజేంద్ర ప్రసాద్‌తో ప్రత్యేక సంబంధం ఉందని తెలిపారు. తన ఆలోచనను మార్చిన డైరెక్టర్ జంధ్యాల అహనా పెళ్ళంట సినిమా తరువాత ఆయన తెరకెక్కించిన ఓ సినిమా వంద రోజుల ఆడిందని వెల్లడించారు. ఇక సినిమా పరిశ్రమలో ఆయన రెండో వైఫ్ ఎవరో, మూడో వైఫ్ ఎవరో, పక్కింటి పెళ్లాం ఎదురింటి మొగుడు సినిమా ఎలా మొదలయ్యిందో చెప్పారు. ఇలా సినిమాల గురించి అతని నిజ జీవితం గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూసేయండి.