కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగులో ‘వారసుడు’గా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా థియేటర్ల విషయంలో వివాదం నడుస్తోంది.
కానీ ఇప్పటి వరకు దిల్ రాజు దీనిపై స్పందించలేదు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘వారిసు’ సినిమా మొదలు పెట్టినప్పుడే.. సంక్రాంతికి అనౌన్స్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ అని.. తెలుగు, తమిళ్, హిందీ.. మూడు భాషల్లో ఈ సినిమాను చేస్తున్నామని.. మే నెలలోనే అనౌన్స్ చేసిన సినిమాపై ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. అలాగే సంక్రాంతి రేసు నుండి ‘ఆదిపురుష్’ తప్పుకుంది కాబట్టి..
తెలుగు స్టేట్స్లో సరిపోయేంత కంఫర్టబుల్ థియేటర్స్ ఉన్నాయి.. ప్రాబ్లమ్ ఏమీ లేదన్నారు. అయితే ఇప్పటివరకు, మేకర్స్ హిందీలో ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. కానీ దిల్ రాజు మాత్రం హిందీలో కూడా చేస్తున్నామని ప్రకటించారు. దాంతో వారసుడు హిందీ వెర్షన్ సంక్రాంతికి థియేటర్లలోకి వస్తుందా.. అనేది సందేహమే. అలాగే ఇప్పటి వరకు ‘వారసుడు’ సంక్రాంతి రేసులో ఉంటాడని చెప్పడం తప్పితే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో..
ఈ సినిమాను జనవరి 12న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. అటు, ఇటుగా రాబోతున్నాయని అంటున్నారు. మరి ఈ మూడు సినిమాల్లో ఏది బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందో చూడాలి.