Vishwak Sen : విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'దాస్ కా ధమ్కీ'.. ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్తో ఈ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు విశ్వక్. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 8.88 కోట్ల గ్రాస్ వసూలు చేసి అదరగొట్టాడు. అయితే రెండో రోజు మాత్రం ధమ్కీ లెక్క కాస్త తగ్గింది.
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ’.. ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్తో ఈ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు విశ్వక్. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 8.88 కోట్ల గ్రాస్ వసూలు చేసి అదరగొట్టాడు. అయితే రెండో రోజు మాత్రం ధమ్కీ లెక్క కాస్త తగ్గింది. రెండు రోజుల్లో 11.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ధమ్కీ కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయనే టాక్ నడిచింది. కానీ మూడో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడు విశ్వక్ సేన్. మొత్తంగా వరల్డ్ వైడ్గా మూడు రోజుల్లో 15 కోట్ల గ్రాస్ అందుకుంది ధమ్కీ మూవీ. మామూలుగా ఈ సినిమా వీకెండ్లో.. అంటే ఫ్రైడే నాడు రిలీజ్ అయి ఉంటే.. వసూళ్లు భారీగా ఉండేవి. కానీ వారం మధ్యలో.. బుధవారం రోజు రిలీజ్ చేసి.. అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకున్నాడు విశ్వక్. అంతేకాదు మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో ధమ్కీ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టేనని చెప్పొచ్చు. దీంతో ఇక పై వచ్చేదంతా లాభమే అంటున్నారు. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. వీకెండ్ శని, ఆది వారాల్లో కలెక్షన్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. పైగా మార్చి 30 వరకు విశ్వక్ సేన్ సినిమాకి అడ్డే లేదు. దాంతో విశ్వక్ కెరీర్ బెస్ట్ హిట్ అండ్ కలెక్షన్స్ కొట్టేసినట్టే. ఈ సినిమా కోసం తను సంపాదించిందంతా పెట్టి రిస్క్ చేశాడు విశ్వక్. అందుకు తగ్గట్టే ఈ సినిమా దుమ్ముదులిపేసింది. పెట్టిన బడ్జెట్ పోను ‘ధమ్కీ’ భారీ లాభాలు తెచ్చి పెట్టడం ఖాయమంటున్నారు. మరి ఫైనల్గా ధమ్కీ బాక్సాఫీస్ ఫిగర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.