జూబ్లీహిల్స్‌లోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు వస్తున్నారు. తన మేనల్లుడు అల్లు అర్జున్ను చిరంజీవి భార్య సురేఖ కలిశారు. ఆయన్ను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. తాజా పరిణామాల గురించి మాట్లాడారు. బన్నీకి ధైర్యం చెప్పారు. అలాగే రాఘవేంద్రరావు, రానా దగ్గుబాటి, రాజకీయనేత గంటా శ్రీనివాస్ రావు, శ్రీకాంత్, R నారాయణమూర్తి, హరీష్ శంకర్, నిర్మాత సురేష్ బాబు, నాగ చైతన్య తదితరులు బన్నీని కలిశారు.