హీరో నాని సమర్పణలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కోర్ట్’. నిన్న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ప్రీమియర్స్తో కలిపి మొదటి రోజే అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించినట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఇది ప్రియదర్శి కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్ అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.