అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఇవాళ జరగనుంది. తాజాగా దీని ప్రోమో రిలీజ్ కాగా.. ఈ సీజన్ ప్రైజ్‌మనీ రూ.54,99,999 అని నాగార్జున ప్రకటించారు. దాన్ని రూ.55 లక్షలుగా నిర్ణయించారు. గెలిచిన విజేతకు టైటిల్‌తో పాటు ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ వేడుకలో ఎక్స్ కంటెస్టెంట్స్, పలువురు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.