తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న RC16లో విజయ్ కీ రోల్ పోషిస్తున్నాడని వార్తలు వినిపించాయి. వాటిపై సేతుపతి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తాను ఆ మూవీలో సమయం లేక నటించడంలేదని తెలిపాడు. అలాగే తెలుగు సినిమాల్లో హీరోలాగా నటిస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ త్వరలోనే ఓ సినిమాలో చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు.