క్యాన్సర్ చికిత్స తీసుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నటి సోనాలి బింద్రే ఎమోషనల్ అయ్యారు. ‘ఆరోగ్యకరమైన జీవనశైలి గడిపినప్పటికీ క్యాన్సర్ బారిన పడ్డాను. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. క్యాన్సర్ విషయం నా కుమారుడికి చెప్పడం చాలా కష్టమైంది. అది అత్యంత కష్టమైన సంభాషణగా అనిపించింది’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.