మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ఇంకా యూట్యూబ్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతునే ఉంది. ఇప్పటివరకు 13 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మరింత స్పీడప్ చేసింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ వర్కింగ్ స్టిల్స్, మేకింగ్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. నయనతార మేకోవర్ వీడియోతో పాటు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మెగాస్టార్ చిరంజీవికి సంబందించిన స్టిల్స్ విడుదల చేశారు. అలాగే బాలీవుడ్లో కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. బుకింగ్స్ భారీ ఎత్తున జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రమోషన్లో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మెగాస్టార్. రాజమౌళి అంటే తనకు ఇష్టమని, అయినా జక్కన్న దర్శకత్వంలో నటించాలనే కోరిక లేదని చెప్పుకొచ్చారు. ఒక్కో సినిమాకు రాజమౌళి మూడు నుంచి ఐదేళ్ల సమయాన్ని తీసుకుంటాడు.. కానీ తాను ఒకేసారి నాలుగు చిత్రాలు చేస్తున్నానని.. అందుకే రాజమౌళితో సినిమా చేయాలని.. చెప్పారు. దాంతో గతంలో మెగాస్టార్, రాజమౌళి కాంబోలో సినిమా ఉంటుందనే పుకార్లకు చెక్ పెట్టినట్టేనని చెప్పొచ్చు.