దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆచార్య ఫ్లాప్‌ను ‘గాడ్ ఫాదర్’ మరిపించడంతో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు మెగాభిమానులు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే యాభై కోట్ల మార్క్‌ను టచ్ చేసిన ఈ సినిమా.. వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ అవడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ క్రమంలో చరణ్ మరో రీమేక్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘గాడ్ ఫాదర్’ మళయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చరణ్ వల్లే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు చిరంజీవి. అందుకే ఇప్పుడు మరో మళయాళ సినిమా రైట్స్‌ను చరణ్ దక్కించుకున్నట్టు సమాచారం.
ఈ ఏడాది సమ్మర్లో వచ్చిన ‘భీష్మ పర్వం’ అనే మలయాళ మూవీ భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అమల్ నీరద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. ఉమ్మడి కుటుంబం.. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట రామ్ చరణ్. ఈ సినిమా కూడా తన తండ్రి చిరంజీవితోనే రీమేక్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఉమ్మడి కుటుంబం చుట్టూ తిరిగే ఈ కథ మెగాస్టార్‌కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అంటున్నారు. అయితే చరణ్ నిజంగానే ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారా.. లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే నిజమైతే చిరు మరోసారి రీమేక్‌తో హిట్ కొట్టడం ఖాయమని చెప్పొచ్చు.