అసలే ఆచార్య ఫ్లాప్‌తో నిరాశగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.. అయినా కూడా ‘గాడ్ ఫాదర్’ను సరిగ్గా ప్రమోషన్స్ చేయట్లేదని.. నిన్న, మొన్నటి వరకు అభిమానుల నుంచి వినిపించిన మాట. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. స్వయంగా మెగాస్టార్ రంగంలోకి దిగడంతో ‘గాడ్ ఫాదర్’ పై హైప్ కాదు.. ఒక్కసారిగా అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఒకే ఒక్క పొలిటికల్ డైలాగ్‌తో సోషల్ మీడియాను హీట్ ఎక్కించారు మెగాస్టార్. ఇక అక్కడి నుంచి మొదలుకొని రోజుకో క్రేజీ అప్డేట్తో ‘గాడ్ ఫాదర్’పై అంచనాలను పెంచేస్తున్నారు. థార్ మార్ ట్రాక్‌తో యూట్యూబ్‌ను షేక్ చేయడమే కాదు.. ఫ్లైట్‌లో స్పెషల్ ఇంటర్య్యూలు చేస్తున్నారు. ఇక అంతకు మించి అనేలా సెన్సార్ టాక్ సాలిడ్‌గా ఉండడంతో ‘గాడ్ ఫాదర్’ సన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. అలాగే మరింత హైప్ పెంచేస్తూ.
. ఫ్యాన్స్‌కు హిట్ హామీ ఇస్తున్నారు చిరు. ఈ దసరా స్పెషాల్టీ ‘గాడ్ ఫాదర్’ అని అంటున్నారు. ఓ రేడియోలో మాట్లాడుతూ.. ‘గాడ్ ఫాదర్’ అంచనాలకు మించి ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రేడియోలో కూడా మెగాస్టార్ ప్రమోట్ చేస్తున్నారంటే.. గాడ్ ఫాదర్ ప్రమెషన్స్ను చిరు ఎలా పరుగులు పెట్టిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దాంతో హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు గాడ్ ఫాదర్ బిజినెస్ భారీగా జరిగిందని టాక్. మొత్తంగా అక్టోబర్ 5న ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటున్నారు.