బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ప్రోమో వచ్చేసింది. గతంలో కంటే ఈ సారి బడా బడా రాజకీయ నేతలు, సీనియర్ స్టార్ హీరోలు ఈ షోకు గెస్ట్‌గా రానున్నారు. ఈ క్రమంలో ముందుగా బావ చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్‌తో సందడి చేశారు బాలకృష్ణ. ప్రోమోలో బైక్ పై రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. ‘సదా నన్ను కోరుకొనే మీ అభిమానం.. అన్ స్టాపబుల్‌ను, టాక్ షోలకి అమ్మమొగుడిగా చేసిందని..’ అన్నారు. మొదటి ఎపిసోడ్‌కు నా బంధువును పిలుద్దాం అనుకున్నాను.. కానీ, ప్రజలందరి బంధువు అయితే బావుంటుందని అనిపించింది. అందుకే.. మీకు బాబు గారు, నాకు బావగారు.. అంటూ నారా చంద్రబాబు నాయుడుకు వెల్కమ్ చెప్పారు.
ఇక ఈ ఇద్దరి మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది. ‘మీ జీవితంలో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పనేంటి.. అని చంద్రబాబును అడగ్గా.. ‘మీకంటే ఎక్కువే చేశానని.. ‘మీరు సినిమాల్లో చేస్తే… నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చేశా.. అమ్మాయిలు కనిపిస్తే బైక్ సైలెన్సర్ తీసేసేవాళ్ళం.. అని చెప్పారు. ఇక ఈ ప్రోమోలో చంద్రబాబు చెప్పిన కొన్ని ఆన్సర్స్ టచ్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ‘మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరనే ప్రశ్నకు.. చంద్రబాబు ‘రాజశేఖర్ రెడ్డి’ అని.. ఇద్దరం కలిసి తిరిగే వాళ్లమని.. చెప్పడం హైలెట్‌గా నిలిచింది.
అలాగే 95లో మనం తీసుకున్న నిర్ణయం తప్పా.. అని బాలకృష్ణను చంద్రబాబు ప్రశ్నించడం.. ఫైనల్‌గా ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని, ఎప్పుడూ గుండెల్లో ఉంటారని చంద్రబాబు చెప్పడం హైలెట్‌గా నిలిచింది. ఇక షో మధ్యలో చంద్రబాబు తనయుడు, బాలయ్య అల్లుడు లోకేశ్ కూడా పాల్గొన్నారు. సరదాగా బాలయ్య, చంద్రబాబులను కొద్దిసేపు హోస్టింగ్ కూడా చేశారు లోకేష్. మొత్తంగా అన్‌స్టాపబుల్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో నెక్ట్స్ లెవల్లో ఉందని చెప్పొచ్చు. ఇక సెకండ్ షో గెస్ట్లుగా యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ రాబోతున్నట్టు సమాచారం.