తనను, లోకేష్ ని చంపాలని చూస్తూన్నారంటూ ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా… ఈ వ్యాఖ్యలపై తాజాగా… విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర భద్రతా దళాల Z ప్లస్ సెక్యూరిటీలో ఉండి కూడా ఎవరో చంపేస్తారంటూ చలిజ్వరం వచ్చినవాడిలా వణుకుతున్నాడంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. టీడీపీని తెలుగు డ్రామాల పార్టీగా అభివర్ణించారు. ఇదేమి ఖర్మ బాబు? రాజకీయాల నుంచి రిటైరై దుప్పటి కప్పుకుని పడుకో అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
కాగా… రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా దేందులూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, లోకేష్ ను చంపుతామని వైసిపి నేతలు చెబుతున్నారని… వాళ్ల బాబాయిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని సీఎం జగన్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
జగన్ కు పోలీసులు ఉంటే తనకు ప్రజలున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం ఉండవని అన్నారు. ఈసారైనా ప్రజలు కళ్లు తెరవాలని చంద్రబాబు పేర్కొన్నారు.