»Bandla Ganeshs Tweet On Chandrababu Sai Reddy Sitting Next To Each Other
bandla ganesh:చంద్రబాబు- సాయిరెడ్డి పక్క పక్కనే కూర్చోవడంపై బండ్ల గణేశ్ ట్వీట్
bandla ganesh:నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇటీవల కాంట్రవర్సీ పోస్టులు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ గురించి ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. తారకరత్న చనిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పక్క పక్కనే కూర్చొన్నారు. ఆ ఫోటోను ట్వీట్ చేసి కామెంట్ చేశారు.
bandla ganesh:నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (bandla ganesh) ఇటీవల కాంట్రవర్సీ పోస్టులు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ (pawan kalyan) రెమ్యునరేషన్ గురించి ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. తారకరత్న (taraka ratna) చనిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandra babu naidu), వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (vijaya sai reddy) పక్క పక్కనే కూర్చొన్నారు. ఆ ఫోటోను ట్వీట్ చేసి కామెంట్ చేశారు. సమయం, సందర్భం లేదు.. వారు ఏ సిచుయేషన్‌లో ఉన్నారు? ఏం మాట్లాడుతున్నారు అని టీడీపీ, వైసీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నాయి.
తారకరత్న.. చంద్రబాబు నాయుడికి అల్లుడు అవుతాడు. భువనేశ్వరి సోదరుడి కుమారుడే తారక రత్న. యువగళం పాదయాత్రలో పాల్గొని కుప్పకూలిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నాడు. ఇంతలో ఇలా చనిపోయి శోకం మిగిల్చాడు. తారక రత్న భార్య అలేఖ్యా రెడ్డి విజయసాయిరెడ్డికి బంధువు అవుతారు. ఆయన మరదలు కూతురే అలేఖ్య.. అంటే ఆమెకు పెద్దనాన్న అవుతారు. తారక రత్న చనిపోవడంతో.. చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఆయన ఇంటికి వచ్చారు.
వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను బండ్ల గణేశ్ (bandla ganesh) చేశాడు. ‘నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్లిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు, టీడీపీ, వైసీపీ కార్యకర్తలు స్పందించారు. బండ్ల గణేశ్‌ను (bandla ganesh) తిట్టి పోశారు.
బండా (bandla ganesh) నువ్వు 100 శాతం రాంగ్ అని ఒకరు.. శాశ్వత శత్రుత్వాలు, మిత్రుత్వాలు ఉండరు అంటూ మరొకరు రాశారు. సెవెనో క్లాక్ బ్లేడ్, స్వీట్ ప్యాకెట్ కావాలా అని అడిగారు. గత ఎన్నికల్లో మహా కూటమి ఓడిపోతే మెడ తెగే సెవెనో క్లాక్ బ్లేడ్ తీసుకురావాలని సవాల్ విసిరారు. ఆయన ఆశించినట్టు కూటమి గెలవలేదు. దీంతో నెటిజన్ల నుంచి ట్రోల్‌కు గురయ్యాడు.