సినీ నటుడు, హిందూ పురం ఎమ్మెల్యే బాలకృష్ణకి ఉన్న క్రేజ్ ఏంటో స్పెషల్ చెప్పనక్కర్లేదు. ఆయన ఏం చేసినా ట్రెండ్ సెట్ అవ్వాల్సిందే. ఇటీవల బాలయ్య ఆహాలో అన్ స్టాపబుల్ పేరిట ఓ టాక్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్యతో టాక్ షో అంటే ఎలా ఉంటుందా అని అందరూ ఆలోచించారు. కానీ.. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ బాలయ్య అదరగొట్టాడు. తన స్పాంటేనియస్ నెస్ తో షోని ఓ రేంజ్ లో హిట్ చేశాడు. ఈ షో ఇప్పుడు సీజన్ 2 కి రెడీ అవుతోంది.
మొదటి సీజన్ లో మొదటి ఎపిసోడ్ మోహన్ బాబుతో చేసి కొన్ని పొలిటికల్ ప్రశ్నలతో ఆసక్తి రేపిన బాలయ్య.. ఈ సారి ఏకంగా.. పూర్తి రాజకీయనాకుడైన చంద్రబాబుతో చేస్తుండటం విశేషం. ఇఫ్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ వార్త ఇప్పుడు టీడీపీ అభిమానులను మరింత ఉత్సాహ పరుస్తోంది.
సొంత బావ, బావమరుదులైన ఈ ఇద్దరు ఒక టీవీలో పాల్గొంటే ఎలా ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి మొదలైంది. బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేస్తాడు..? చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇస్తాడా అని చర్చ ఇప్పటికే మొదలైంది. ప్రత్యర్థులపై చంద్రబాబు ఈ షోలో ఏమైనా కౌంటర్లు వేయనున్నారా అనే చర్చకూడా మొదలైంది. లేదంటే.. వచ్చే ఎన్నికల కోసమే ఈ షోలో చంద్రబాబు పాల్గొన్నాడా అనే అనుమానాలు కూడా రేకెత్తుతుండటం గమనార్హం.