‘పుష్ప 3 ది ర్యాంపేజ్’లో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు ఇటీవల ప్రచారం జోరందుకుంది. దీనిపై తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రష్మిక స్పందించింది. ‘మీలాగే నాక్కూడా ఆ విషయం గురించి తెలియదు. దర్శకుడు సుకుమార్ ప్రతి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తారు. ఆఖరి వరకూ విషయాన్ని బయటపెట్టరు. సినిమా క్లైమాక్స్‌లో ముసుగు వేసుకున్న వ్యక్తిని చూసి.. ‘ఇతనెవరు?’ అని నేను కూడా ఆశ్చర్యపోయా’ అని చెప్పుకొచ్చింది.