సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. దీనిపై స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు. బన్నీను చూసి ఆయన భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అయిన వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ‘ఇప్పుడు నేనేమీ ఏడవడం లేదు ఓకే’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజీలను పోస్ట్ చేశారు. దానికి అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను ట్యాగ్ చేశారు.