Charan-Jr.NTR : ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లను ఒకే స్క్రీన్ పై చూసి తెగ మురిసిపోయారు మెగా, నందమూరి అభిమానులు. కాకపోతే కొన్ని విషయాల్లో కొట్టుకున్నారు.. అది వేరే విషయం లేండి. కానీ చరణ్, తారక్ మల్టీస్టారర్ మాత్రం ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియెన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లను ఒకే స్క్రీన్ పై చూసి తెగ మురిసిపోయారు మెగా, నందమూరి అభిమానులు. కాకపోతే కొన్ని విషయాల్లో కొట్టుకున్నారు.. అది వేరే విషయం లేండి. కానీ చరణ్, తారక్ మల్టీస్టారర్ మాత్రం ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియెన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది. ట్రిపుల్ ఆర్ ఏకంగా ఆస్కార్ కొట్టేయడంతో ఇద్దరు గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. మళ్లీ ఈ ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూడాలంటే.. అది రాజమౌళికే సాధ్యం. అది కూడా ట్రిపుల్ ఆర్ సీక్వెల్ సెట్ అయితేనే. కానీ ఈ ఇద్దరు మాత్రం.. మరోసారి థియేటర్లో బ్యాక్ టు బ్యాక్ సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు కష్టమే అంటున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో మహేష్ బాబు, ప్రభాస్ ఉన్నారు. ప్రాజెక్ట్ కె జనవరి 12, SSMB 28 జనవరి 13న థియేటర్లోకి రాబోతున్నాయి. కాబట్టి గేమ్ చేంజర్ సంక్రాంతికి వచ్చే అవకాశాలు తక్కువ. దీంతో ఈ సినిమా సమ్మర్‌కు షిప్ట్ అయినట్టే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మార్చి ఎండింగ్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అది కూడా ఎన్టీఆర్ 30కి రెండు వారాల ముందు థియేటర్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ 30ని 2024 ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు కొరటాల శివ. దాంతో మరోసారి చరణ్, ఎన్టీఆర్.. థియేటర్ల దగ్గర ఒకేసారి మాస్ జాతర చేయబోతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ మధ్యన బాక్సాఫీస్ లెక్కలు మారిపోవడం పక్కా. ఎవరి సినిమా బాగుంది, కలెక్షన్లు ఎలా ఉన్నాయి, ట్రైలర్, యూట్యూబ్, సోషల్ మీడియా రికార్డ్స్, ఇలా ప్రతి విషయంలోను మెగా నందమూరి ఫ్యాన్స్ పోటి పడడం ఖాయం. దీంతో రెండు వారాల గ్యాప్‌తో చరణ్, ఎన్టీఆర్ థియేటర్లోకి వచ్చినా.. ఖచ్చితంగా బాక్సాఫీస్ వార్ మాత్రం పీక్స్‌లో ఉంటుందని చెప్పొచ్చు.