»Bigg Boss Keerthi Engagement Photos Viral On Social Media
Bigg Boss కీర్తి ఎంగేజ్మెంట్.. నెట్టింట ఫోటోలు వైరల్..!
ప్రేమించిన కార్తీక్‌తో బిగ్ బాస్ కీర్తి నిశ్చితార్థం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు సీరియల్, బిగ్ బాస్ హౌజ్ మెట్స్ హాజరై.. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
Bigg Boss Keerthi Engagement Photos Viral On Social Media
Bigg Boss Keerthi: ప్రముఖ టీవీ సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రేమించిన కార్తీక్‌తో ఆదివారం నిశ్చితార్థం జరిగింది. టీవీ సీరియల్స్ నటీనటులు, బిగ్ బాస్ సెలబ్రెటీలు అందరూ హాజరై సందడి చేశారు.
కీర్తి మొదట మనసిచ్చి చూడు సీరియల్‌తో కెరీర్ ప్రారంభించింది. ఆ సీరియల్ బాగా క్లిక్ అవ్వడంతో మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్లో హిమగా నటించింది. వెంటనే ఆ సీరియల్లో కొన్ని మార్పులు చేయడంతో, ఆమె బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన జీవితంలో కోల్పోయినవి, ఎన్ని కష్టాలు పడింది ఇలా అన్నీ చెప్పడంతో, అందరూ ఆమె కన్నీటి గాథకు కనెక్ట్ అయ్యారు.
రోడ్డు ప్రమాదంలో తన వారందరినీ కోల్పోయానని తెలిపింది. ఒక బిడ్డను పెంచుకుంటే, ఆ పాప కూడా చనిపోయింది. ఒంటరిగా మిగిలిపోయింది. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి కార్తీక్ వచ్చాడు. ఆమెకు పిల్లలు పుట్టరని తెలిసి కూడా.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. వీరి ప్రేమకు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు కార్తీక్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో కీర్తి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. త్వరలో పెళ్లి జరగనుంది. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.