»Bigg Boss 7 Contestants Fighting For The Captaincy Are Ata Sandeep And Pallavi Prashanth
Bigg Boss 7: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్
వీకెండ్ కావడంతో బిగ్ బాస్ 7 రసవత్తరంగా మారింది. కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ నడుమ టాస్క్ గొడవకు దారి తీసింది. రంగు పడుద్ది టాస్క్‌లో భాగంగా పల్లవి ప్రశాంత్, ఆటా సందీప్, గౌతమ్, టేస్టీ తేజలు పోటీ పడ్డారు.
Bigg Boss 7 contestants fighting for the captaincy are Ata Sandeep and Pallavi Prashanth
Bigg Boss 7: బిగ్‌బాస్(Bigg Boss 7) ఐదోవారంలో కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్నారు కంటెస్టెంట్స్. మొదటి కెప్టెన్ అయ్యేందుకు రంగు పడుద్ది రాజా అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. అందులో ఒక్కో కంటెస్టెంట్ టీషర్ట్ పై వేరే ప్రత్యర్థి రంగు పడకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆఖరి బజర్ మోగేసరికి ఎవరి టీషర్ట్ పై తక్కువ పెయింట్ ఉంటుందో అతనే బిగ్‌బాస్ మొదటి వారం ఫస్ట్ కెప్టెన్ అవుతారని చెప్పారు బిగ్‌బాస్. టాస్క్ స్టార్ట్ అవగానే సందీప్(Ata Sandeep) టీషర్ట్ లాగాడని అమర్ దీప్ అరవగా.. ముఖంపై ప్రశాంత్ కొట్టాడని వాదించాడు సందీప్. దీంతో నువ్వు కొట్టిన తర్వాతే నేను కొట్టానంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. ఇక రౌండ్ నుంచి బయటకు రావడంతో సందీప్ రేసు నుంచి తప్పుకున్నాడని అనౌన్స్ చేసింది సంచాలక్ ప్రియాంక. దీంతో ప్రియంకతో వాదిస్తూ నన్ను తోశారని.. నన్ను కొడితే తాట తీస్తానంటూ రెచ్చిపోయాడు సందీప్. ఇక చివరగా గౌతమ్, ప్రశాంత్ మధ్య పోటీ నడిచింది.