లైగర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా.. రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌తో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఒకవేళ ఈ సినిమా హిట్ అయి ఉంటే.. ఇప్పుడు రౌడీ పాన్ ఇండియా హీరోగా మరింత సత్తా చాటేవాడు. కానీ ఈ సినిమా విజయ్‌తో పాటు ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది.
దాంతో పూరి, రౌడీ ఇద్దరు.. పాన్ ఇండియా కలతో పాటు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో విజయ్ క్రేజ్ తగ్గిపోయిందని.. నెక్ట్స్ ప్రాజెక్ట్ బిజినెస్ పై లైగర్ ఎఫెక్ట్ ఉంటుదనే కామెంట్స్ వినిపించాయి. కానీ అప్ కమింగ్ ఫిల్మ్ ‘ఖుషి’కి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సమంత హెల్త్ ప్రాబ్లమ్ వల్ల షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు. దాంతో డిసెంబర్ నుంచి నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌కు ‘ఖుషి’ పోస్ట్ అయిందని వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా..
థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ 90 నుంచి 100 కోట్లు కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అన్ని భాషల్లో కలిపి 90 కోట్లకు అమ్ముడు పోయినట్టు ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి ఇంత మొత్తంలో బిజినెస్ జరిగింని అంటున్నారు. ఒక్క ఆడియో రైట్స్‌కే 13 కోట్లు వచ్చాయని టాక్. దాంతో లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత కూడా విజయ్ సినిమాకు ఇంత బిజినెస్ జరగడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇందులో నిజముందో లేదో తెలియదు గానీ.. విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పొచ్చు.