సీనియర్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్‌కు 'భారతీయుడు 2' సినిమా షాక్ ఇచ్చింది. ఇదే కాదు.. గతంలో కూడా ఆచార్య విషయంలో ఇదే జరిగింది. మరి కాజల్‌కే ఎందుకిలా జరుగుతోంది? శంకర్ ఏమంటున్నాడు.
Bharatiyadu 2: హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్దాలు అవుతోంది. పెళ్లైంది.. బాబు కూడా పుట్టాడు. అయినా కూడా.. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తునే ఉంది కాజల్ అగర్వాల్. లాస్ట్ ఇయర్ బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాతో మెప్పించిన కాజల్.. రీసెంట్గా సత్యభామగా అలరించింది. ఇక త్వరలోనే భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందని అనుకున్నారు. కానీ శంకర్ మాత్రం కాజల్‌కు షాక్ ఇచ్చాడనే చెప్పాలి. జూలై 12న ఇండియన్ 2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో.. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. భారతీయుడు 2లో కాజల్ క్యారెక్టర్ కనిపించదని షాక్ ఇచ్చాడు. వాస్తవానికైతే.. ఇండియన్ 2లో కాజల్‌ను మెయిన్ హీరోయిన్గా తీసుకున్నారు.
అందుకోసం.. గుర్రపుస్వారీ, మార్షల్ ఆర్ట్స్ అంటూ ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంది కాజల్. చాలా రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ చేసింది. కానీ.. కాజల్ క్యారెక్టర్ ఇండియన్ 2లో ఉండదని, పార్ట్ 3లో ఆమె కనిపిస్తుందని తెలిపాడు శంకర్. ఇండియన్ 2 కోసం కాజల్‌పై షూట్ చేసిన సీన్స్ మొత్తం పార్ట్ 3లోనే ఉండేలా మార్పులు చేర్పులు చేశాడట శంకర్. అందుకే.. ఈ సినిమా ప్రమోషన్స్‌కు కాజల్ దూరంగా ఉంటుందని అంటున్నారు. అయితే.. గతంలో కూడా ఆచార్య విషయంలో కాజల్‌కు షాక్ ఇచ్చారు మేకర్స్. ఆచార్య మూవీలో కాజల్‌ను హీరోయిన్గా తీసుకున్నాడు కొరటాల. చిరంజీవి, కాజల్ కాంబినేషన్లో చాలా సీన్స్ షూట్ చేశారు. కానీ.. అనుకోకుండా కాజల్ క్యారెక్టర్ మొత్తాన్ని సినిమా నుంచి లేపేశారు. ఇప్పుడు భారతీయుడు 2 విషయంలో కూడా అలాగే జరిగిందని చెప్పాలి.