Kajal Aggarwal: నటసింహం నందమూరి బాలకృష్ణను ఫ్యాన్స్ వివిధ పేర్లతో పిలుస్తుంటారు. టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య ఎలాంటి భేదం లేకుండా అందరితో మంచిగా ఉంటారు. బాలయ్య, డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీలీల కీలకపాత్ర పోషిస్తుంది. అక్టోబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం వరంగల్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేదికపై కాజల్ బాలయ్యను ముద్దుగా ‘బాల్స్’ అని పిలవడంతో ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షుటింగ్కి వెళ్లిన మొదటిరోజు చందమామ బాలయ్యను సార్ అని పిలవగా.. నన్ను సార్ అని పిలవద్దు. నువ్వు ‘బాల్స్’ అని పిలవమని బాలయ్య అన్నారని కాజల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలిపింది. కాజల్ మాట్లాడుతూ.. భగవంత్ కేసరి నాకు చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే ఇద్దరి కాంబోలో రాబోతున్న మొదటి చిత్రం ఇదే. బాలయ్య గ్రేట్ లెజెండ్. ఒక పెద్ద సూపర్ స్టార్ అయి కూడా అందరితో మంచి స్నేహితుడిగా ఉంటారు. ఇంతటి గొప్ప వ్యక్తి భవిష్యత్తులో ఆకాశం అంత ఎత్తుకు.. కాదు మరో ప్లానెట్ను అందుకోవాలి. మీరు చాలా గ్రేట్. మీతో కలిసి వర్క్ చేయడం గౌరవంగా భావిస్తున్నాని బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించింది.