Bedurulanka 2012: ఓపెన్ చేస్తే వాయిస్ ఓవర్ మొదలౌతుంది. 2012 డిసెంబర్ 12 ప్రపంచమంతా యుగాంతం వస్తుందని, ప్రళయం వస్తుందని భయపడిన రోజు.. కాని మన అందరికి తెలిసినట్టుగా ఎక్కడ ఏం జరగలేదు మా ఊర్లో తప్ప అనే వాయిస్ తో బెదురులంక ఊరు ఏరియల్ షాట్ తో 3 వారాల ముందు అనే టైటిల్ పడుతుంది. కట్ చేస్తే ఆ ఊర్లో జనాలంతా టీవిల్లో, వార్తల్లో చెప్పే 2012 యుగాంతం గురించి ఆసక్తిగా వింటారు. గొడ్లసావెడిలో, ఇంట్లో, టీ కొట్లో, పొలం పనుల్లో ఎక్కడా చూసిన ఇదే వార్తలతో ఊరంతా నిండిపోతుంది. తరువాత సీన్లో టీవీలో న్యూస్ రీడర్ గెటప్ సీను టీవీ 777లో యుగాంతం స్టోరీ బోర్టులో యుగాంతం వచ్చి అంతా మునిగి పోతుంది అని చెప్తాడు. అదే సమయంలో ఇంట్లో భూషణం, బ్రహ్మం, డెనియల్ ముగ్గురు మందు తాగుతూ మాట్లాడుకుంటారు. యుగాంతం నిజమేనా అనే దానిపై ముగ్గురు చర్చించుకుంటారు. అసలు యుగాంతం రాదని టీవీలు ఇలానే ఊదరగొడుతుంటాయని చెప్తాడు. దీన్ని ఆసరాగా చేసుకొని ధనవంతులం అవుదామని దానికి పూజారి అయిన బ్రహ్మం తలుచుకుంటే అవుతుందని దానికి భూషణం ఒక ప్లాన్ చెప్తాడు. యుగాంతం ఎలాగో రాదన్న విషయం మనందరికి తెలుసు కాని ఊర్లో జనాలకు అబద్దం చెప్పి భయపెట్టాలని అంటాడు. యుగాంతం వస్తుందని దానికి మన ఊరు కూడా మునిపోతుంది అని భయపెట్టి ఆ తరువాత బ్రహ్మం యుగాంతం ఆపేస్తానని చెప్పమంటాడు. దానికి ఫస్ట్ బ్రహ్మం జనాలకు తెలిస్తే కొడుతారు అని భయపడుతాడు. దానికి భూషణం కన్విన్స్ చేస్తాడు. విషయం గ్రహించిన డెనియల్ నేను కూడా మీతో పాటు ఈ ఆట ఆడుతా అని వారితో జయిన్ అవుతాడు. ముగ్గురు కలిసి ఊరి జనాన్ని భయపెట్టాలని ఫిక్స్ అవుతారు. తరువాత బెదురులంక టైటిల్ పడుతుంది.
చదవండి:Shock ఇచ్చిన శంకర్.. ‘గేమ్ చేంజర్’ పరిస్థితేంటి?
తరువాతి సీన్లో హైదరాబాద్ లో గ్రాఫిక్స్ చేసే కంపెనీలో శివకు ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే సిరి మాట్లాడుతుంది. ఈ సారి జాతరకు ఊరుస్తొన్నువా అని అడిగితే రాను అంటాడు శివ. అయితే చిత్రకు లవ్ ప్రపోజ్ చేస్తే తిట్టిందని ఇంకా తనమీద కోపం పోలేదని అందుకే ఊరుకు రాను అని అంటాడు. ఈ సారి నువ్వు ఊరొస్తే చిత్రనే నీకు ఐలవ్ యు చెప్తుందని అనే సరికి శివ ఊరొస్తా అంటాడు. ఫోన్ కట్ చేసి సంతోషపడుతుంటాడు. టైమ్ లాప్స్ తరువాత మార్నింగ్ షిఫ్ట్ లో ఎంప్లయిస్ అందరూ వస్తారు. మ్యానేజర్ వచ్చి నిద్రపోతున్న శివను లేపి రెండర్ అయిందా అని గ్రాఫిక్స్ చూపిస్తారు. ఆ గ్రాఫిక్స్ లో పులి నిజమైన పులిలా ఉందని పాతికకోట్లు ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ సినిమా అని చెప్పి చిత్రం తీస్తున్నప్పుడు.. అది నిజం పులిలా ఉందని అది మార్చండి అని నిర్మాత అంటాడు. దానికి శివకు కోపం వచ్చి ప్రొడ్యూసర్ ను తిట్టి జాబ్ వదిలేసి వెళ్లిపోతాడు.
నెక్ట్స్ సీన్లో బెదురులంకలో ప్రెసిడెంట్ పిట్టను షూట్ చేసి తన కింద పనిచేసే ముత్యంను పిట్టను తీసుకురా అంటాడు. ప్రెసిడెంట్ ముందు పొగిడిన ముత్యం, పిట్టకోసం వెళ్లి తిట్టుకుంటూ తానే ఒక పిట్టను రాయితో కొట్టి తీసుకొని వస్తున్న సమయంలో భూషణం ఫోన్ చేస్తాడు. తాను చెప్పిన విషయం ఎంత వరకు వచ్చింది అని అడుగుతాడు. దాంతో ముత్యం ప్రెసిడెంట్ తో భూషణం కొడుక్కు, తన కూతురుతో పెళ్లి సంబంధం గురించి టాపిక్ తీస్తాడు.
నెక్ట్స్ సీన్లో పంతులు ఒక ఉంగురాన్ని కొట్టేసి వెళుతూ పిల్లలను మందిలిస్తాడు. గడుసు పిల్లలు పంతులను ఆటపట్టించడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తరువాత పిల్లలు యుగాంతం గురించి మాట్లాడుకుంటారు. కట్ చేస్తే శివ పడవలో బెదురులకంలో దిగుతాడు. పిల్లలుకు చాక్లెట్లు ఇస్తాడు. అక్కడ పూజిరితో ఎల్బీ శ్రీరామ్ తో మట్లాడుతాడు. తరువాత సీన్లో కొబ్బరి తోట్లో ప్రెసిడెంట్, భూషణం యుగాంతం గురించి మాట్లాడుకుంటారు. దూరం నుంచి శివ సిగరేట్ తాగుతూ వస్తాడు. అది చూసి భూషణం మందలిస్తాడు. దానికి శివ వాళ్లకు వాళ్లరీతిలోనే బుద్ధి చెప్తాడు. నేను ఏం తాగితే మీకెందుకు అని గట్టిగానే చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో వాడినెందుకు కెలకడం వాడు ఎవడి మాట వినడు అని తెలుసు కదా అని భూషణంతో ప్రెసిడెంట్ అంటాడు. దాంతో శివకు ఉద్యోగం పోయిందన్న విషయాన్ని ఊర్లో అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. దేన్నో కెలికాడట అందుకే ఉద్యోగం పోయిందట నుంచి జాబ్ లో ఎదో ఫ్రాడ్ చేస్తే జైల్ కు పంపించారట వరకు ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుకుంటారు.
తరువాత సీన్లో శిత తండ్రి నారయాణ రావుతో మీ అబ్బాయి ఉద్యోగం పోయిందని, ఆఫీస్ లో దెన్నో ఏడిపిస్తే మ్యానేజర్ కొప్పడ్డాడని, దాంతో శివగాడు వాన్ని కొడితే కేసు అయిందని చెప్తాడు. అదంతా విన్న నారయణరావు తన భార్యతో శివగాడు వస్తున్నాడట వాడికి తినడానికి ఏమన్నా చేయి అంటాడు. అది విని వచ్చిన అతను నిరుత్సాహంతో వెళ్లిపోతాడు. దారిలో శివ కలిస్తే అతను అలిగిపోతాడు. శివ ఉప్మ తింటాడు. తరువాత సీన్లో ప్రెసిడెంట్ ముత్తాతాగారి పేరుమీద బల్లెం పోటీలు జరుగుతాయి. మరో పక్క శివ తన ఫ్రెండ్స్ తో మందు కొట్టడానికి వెళ్తాడు. పోటీలు నిర్వహిస్తుంటారు.
ప్రెసిడెంట్ తన తాతా గురించి గొప్పలు చెప్తుంటాడు. తన తాతా రికార్డును బద్దలు కొట్టాలంటే ఒక పదివేలు ఇవ్వమని తన ఫ్రెండ్స్ తో అంటాడు శివ. ఇదే విషయాన్ని ముత్యం ప్రెసిడెంట్ తో చెప్పగానే ఇరువై వేలు ఇస్తా దమ్ముంటే బల్లెం వేయమను అంటాడు. పోటీలో దిగుతాడు శివ. బల్లెం విసురుతాడు. అది వాళ్ల తాతా విగ్రహాన్ని దాటి వెళ్లి సముద్రంలో పడుతుంది. దాంతో తన ఫ్రెండ్స్ అంతా సంబరాలు చేసుకుంటారు. ప్రెసిడెంట్ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్ తో పాటు ఎంజయ్ చేసుకుంటూ సాంగ్ ఏసుకుంటాడు. అదే పాటలో చిత్ర ఎంట్రీ ఉంటుంది. మ్యూజిక్ తో టవల్ తో డ్యాన్స్ చేస్తుంది. ఒక వైపు బల్లెం కోసం వెతికిస్తుంటాడు ప్రెసిడెంట్. అదే మ్యూజిక్ లో డ్యాన్స్ చేస్తుంటాడు శివ. డ్యాన్స్ చేస్తుంటే చిత్ర అతన్ని చూస్తుంది. ఆ సంఘటను భూషణం కొడుకు కసిరాజు చూస్తాడు.
కట్ చేస్తే కసిరాజు తాగుతూ శివను తిట్టుకుంటుంటాడు. నువ్వు చిన్నప్పటి నుంచి నీకు నచ్చినట్లే బతుకుతున్నావ్ అని తాను డ్యాన్స్ చేస్తా అని సాంగ్ పెట్టమని తన సెటప్ సత్యవతి దగ్గర డ్యాన్స్ చేసి పడిపోతాడు. కట్ చేస్తే తన దగ్గర పని చేసే వాడు సుబ్బు అతన్ని తీసుకొని భూషణం ఇంటికి తీసుకెళ్తాడు. దాంతో మజ్జిక తాగిచ్చి భూషణం తన కొడుకును కొడుతాడు. మనకుటుంబంలో అంతా ఎదవలమని అయినా సరే ఊరికి తెలియకుండా మ్యానేజ్ చేయాలని చెప్తాడు. చిత్రతో పెళ్లి అయ్యేవరకు కొంచెం మంచిగా ప్రవర్తించు అని బతిమిలాడుతాడు.
కట్ చేస్తే శివకు ప్రపోజ్ చేయడానికి చిత్ర తన ఫ్రెండ్ పడవలో వెళ్తుంది. ఈ సారి ఐలవ్ యు చెప్తా అని సిరితో అంటుంది. అదే సమయంలో గోదారి ఈదుకుంటూ శివ పడవ దగ్గరకు వచ్చేస్తాడు. దాంతో చిత్ర మళ్లీ పారిపోతుంది. ఐలవ్ యూ చెప్పకపోతే తాను వెళ్లిపోతున్నట్లు చిత్రతో చెప్పి ఈదుకుంటూ వెళ్లిపోతాడు. తరువాత డెనియల్ తన కొడుకు భార్యతో ఉరి వేసుకొని చర్చికి ఫాధర్ అవుతానని లేదంటే చనిపోతా అని తన తండ్రిని బెదిరిస్తాడు. నెక్ట్స్ సీన్లో భూషణ్ బ్రహ్మం ఇద్దరు మందు తాగుతుంటే అక్కడికి డెనియల్ వచ్చి చర్చి ఫాదర్ అయినట్లు చెప్తాడు. ఇక వాళ్లు ప్రజలను మోసం చెయ్యాలని ఫిక్స్ అవుతారు. బ్రహ్మం ఇంకా భయపడుతున్నందుకు అతనికి కొన్ని కథలు చెప్పి ఒప్పిస్తాడు భూషణం.
తరువాత సీన్లో చిత్ర మగాడిలా వేషం వేసుకొని వస్తుంది చిత్ర. శివకు ఐలవ్ యూ చెప్తున్నట్లు తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ వస్తుంది. అంతలో అక్కడికి శివ వస్తాడు. తన కోసం సిగరేట్ మానేయ్యమంటుంది. ఇది కిక్ ఇస్తుందిని దీనికంటే నువ్వు కిక్ ఇస్తే మానేస్తా అంటాడు. దానికి అలిగి వెళ్లిపోతుంది. రొమాంటికి సాంగ్ స్టార్ట్ అవుతుంది. పాట ఎండింగ్ లో చిత్ర ముద్దిస్తుంది. శివ సిగరేట్ కిందపడేస్తాడు.
తరువాత సీన్లో ప్రెసిడెంట్ ఇంటి దగ్గర భూషణం అందరు కలిసి పేక ఆట ఆడుతుంటాడు. ఆడుతూ బ్రహ్మంకు ఒక కల వచ్చిందని అది యుగాంతానికి సంబంధం అని మాట్లాడుకుంటారు. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని ప్రెసిడెంట్ తో కలిసి బ్రహ్మం ఇంటికి వెళ్లేసరికి చాలా మంది ఉంటారు. అక్కడ బ్రహ్మం ద్యానంలో ఉన్నాడని అందరిని నమ్మిస్తాడు. అక్కడ ప్రెసిడెంట్ కు కూర్చి వేయించి, సుట్ట తాగడానికి బయటకు వచ్చి బ్రహ్మంకు ఫోన్ చేస్తాడు. అతన్ని మోటివేట్ చేస్తాడు. దాంతో గెటప్ మార్చి బ్రహ్మం బయటకు వస్తాడు. అతన్ని హెలన చేస్తాడు భూషణం. దాంతో బ్రహ్మం నుదిట మీద వేలు పెట్టి నొక్కుతాడు. వెంటనే భూషణం కిందపడిపోతాడు. బ్రహ్మం మాటలు చెప్తూ అందరిని భయపెట్టిస్తాడు. దానికి భూషణం యాక్టింగ్ చేస్తాడు. దాంతో ఊరి జనం అంతా నమ్ముతారు. పరిష్కారం కోసం అందరూ అడుగుతారు. అదే ఆలోచిస్తున్నాని ఇంట్లోకి వెళ్లి మందుతాగుతాడు. జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతారు.
మరో వైపు డెనియల్ ఫాస్టర్ గా మారిపోయి. ఊరి వారికి యుగాంతం గురించి చెప్తూ భయపెడుతుంటాడు. అక్కడికి శివ వచ్చి బైబిల్ లో ఒక ప్రశ్న అడిగుతాడు. దానికి డెనియల్ తన కొడుకును సలహా తీసుకుంటాడు. దొంగచాటుగా బైబిల్ అంతా వెతికిన డెనియల్ కొడుకూ అందులో అలాంటి సమాచారం లేదని కొడుకు చెప్తాడు. దాంతో అతను అడిగిన ప్రశ్న బైబుల్ ఉండకుండా చూడమని దేవుడితో డెనియల్ చెప్పినట్లు అందరిని ఆ వాఖ్యం బైబిల్ వెతకమంటాడు. ఎంత వెతికినా వ్యాఖ్యం ఉండకపోవడంతో అందరూ యుగాంత నుంచి కాపాడే నాథుడు వచ్చాడని డెనియల్ ను నిజమైన ఫాస్టర్ గా నమ్ముతారు.
మరో వైపు ఇలాంటి ఫాస్టర్ల వలనే దేవుడికి చెడు పేరు వస్తుందని డెనియల్ తండ్రి ప్రభువుకు ప్రార్థన చేస్తాడు. మరో సీన్లో భూషణం, బ్రహ్మం మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటారు. డెనియల్ గాడు కవర్ చేశాడు కాని నా వల్ల కాదు అని బ్రహ్మం అంటుంటాడు. దానికి భూషణం బ్రహ్మంను కొట్టి నేను చెప్పినట్లు చేయి అని చెప్పి వెళ్లిపోతాడు. తరువాత బ్రహ్మం గెటప్ వేసుకొని వస్తాడు. దిగంబర దిగంబర్ బ్రహ్మం బాబా దిగంబర అనుకుంటూ భూషణం వస్తాడు. ఈ ప్రళయం నుంచి కాపాడానికి ఏదైనా ఉపాయం ఉందా అని అడిగితే ఊర్లో ఉన్న జనం దగ్గర ఉన్న బంగారం అంతా కరిగించి శివలింగం చేయించి పంచామృతంతో శాంతి జరిపించి సముద్రంలో వేస్తే అది కచ్చితంగా శివుడికి చేరుతుందని చెప్తాడు. దానికి అందరూ ఓకే అంటారు. అలాగే డేనియల్ కూడా వారి భక్తుల బంగారంతో సిలువ చేయించాలి అంటాడు. అలా ఊర్లో ఉన్న బంగారం అంతా అటు బ్రహ్మం, ఇటు డెనియల్ దోచుకుంటారు. సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ లో ఊర్లో ఉన్న జనంతా తమ బంగారాన్ని ఇచ్చేస్తారు.
సాంగ్ అయిపోగానే చిత్ర శివ దగ్గరకు వస్తుంది. శివ బంగారం ఇవ్వలేదని, దీక్షపాటించకుండా తింటున్నాడని అడుగుతుంది. దానికి శివ అలాంటివి నేను నమ్మను అని చెప్తాడు. అంతో చాక్లెట్ తీసుకొని తింటుంటే మా నాన్నతో గొడవ పెట్టుకోకు అని చెప్పి వెళ్లిపోతుంది. సడెన్ గా వచ్చి చాక్లెట్ తీసుకొని తినుకుంటూ వెళ్లిపోతుంది. తరువాతి సీన్లో పిల్లలు బల్లెం కోసం వెతుకుతుంటారు. కట్ చేస్తే శివ కాఫీ అని అరుస్తాడు. శివ వాళ్ల ఇంట్లో బంగారం కూడా ఇచ్చేశారని తెలుసుకొని కోపంతో డెనియల్ దగ్గరకు వెళ్తాడు. కట్ చేస్తే డెనియల్ చికెన్ తింటుంటాడు. అతని కొడుకు వచ్చి డాడి గొర్రెల వచ్చేశారు అని చెప్తాడు. దాంతో మళ్లీ కాపారిలా గెటప్ వేసుకొని వాళ్ల ముందుకు వస్తాడు. అక్కడి శివ కోపంగా వచ్చి తన రింగ్ ను పెట్టుకొని అడ్డుచ్చిన ఒకడిని తన్ని బైక్ మీద బ్రహ్మం దగ్గరకు వెళ్తాడు. ఈ విషయాన్ని డెనియల్ భూషణంకు ఫోన్ చేసి చెప్తాడు. విషయం చెప్పగానే బ్రహ్మం ద్యానం టైమ్ అయిందని లోపలికి వెళ్తాడు. అదే సమయంలో శివ అక్కడికి వచ్చి తన బంగారం తీసుకొని ప్రెసిడెంట్ కాదు కదా ప్రైమ్ మనిస్టర్ చెప్పినా నేను వినను, నమ్మను అని అంటాడు. అలాగే మూడు యుగాలను కాపడాని దేవుడు ఈ యుగం అంతం కాకుండా ఆపుతాడా అని, అలాగే మన ఊర్లో పూజ చేస్తే ప్రపంచం మొత్తం ఎలా ఆగిపోతుంది అని ప్రశ్న అడిగిపోతాడు. దాంతో భక్తులలో గుసగుస మొదలౌతుంది. అంతలో అక్కడికి బ్రహ్మం వచ్చి తన ప్రాణాలు పోయినా సరే యుగాంతాన్ని ఆపుతా అంటాడు. అలాగే డెనియల్ కూడా శిలువను మోసి ప్రాణాలు ఆర్పించైనా సరే యుగాంతాన్ని ఆపుతానని ప్రజలను నమ్మిస్తాడు.
మరో సీన్లో ప్రెసిడెంట్ మాట కాదన్న విషయం భూషణం ఎక్కించి చెపుతాడు. దాంతో ప్రెసిడెంట్ కోపంతో రేపు తెల్లారి కల్లా క్షమాపణ చెప్పి రింగులు ఇవ్వకపోతే శివను ఊరి నుంచి వేలేస్తా అని అంటాడు. తరువాత సీన్లో శివ వాళ్ల నాన్న ఒక్కసారి ఆలోచించు అని అంటాడు. మరో సీన్లో శివతో చిత్ర కూడా అదే అంటుంది. రింగులు ఇవ్వు అని, నేను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమిస్తున్నాన్ని నా కోసం రింగులు ఇవ్వలేవా అని అంటుంది. దాంతో శివ ఆలోచనలో పడుతాడు. అందరూ నలుగురితో నారాయణ అనకుండా వీడికెందుకు వచ్చింది అని అంటుంటారు. అదే సమయంలో ఎల్బీశ్రీరామ్ వచ్చి శివకు మంచి మాటలు చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ మీటింగ్ పెట్టుకుంటారు శివ కోసం వెయిట్ చేస్తుంటారు. అ సమయంలో అక్కడికి వచ్చిన శివ అందరికి క్షమాపణ చెప్పి.. ఆ రింగులు ఇవ్వను అని చెప్తాడు. అంతే కాకుండా చిత్ర తాను ప్రేమించుకున్న విషయాన్ని అందరిముందు చెప్తాడు. అదే సమయంలో ఊరి నుంచి వెలేస్తా అని ప్రెసిడెంట్ అంటాడు. దాంతో శివ తండ్రి బతిమిలాడుతాడు. రింగులు ఇచ్చేసి ఊరు నుంచి వెళ్లిపోతాడు శివ.
కట్ చేస్తే మరో సీన్లో బంగారం కరిగించి శిలువ, శివలింగం చేస్తారు. అయితే ప్లాన్ లో భాంగా రెండు సిలువలు, రెండు శివలింగాలు తయారు చేస్తారు. ఒకటి గోదాట్లోకి మరోకటి వీళ్లకు అని మాట్లాడుకుంటారు. ఆ వాటలతో మీరు ఏం చేస్తారు అని భూషణం అడుగుతాడు. అలా ముగ్గురు బ్యాంకాక్ వెళ్తారాని సంబరం చేసుకుంటారు. తరువాత సీన్లో శివలింగం, సిలువ గోదాట్లో వెస్తారు. మూడు రోజుల ఉపవాసంతో ఉన్న ప్రజలు ఆకలితో ఇష్టం వచ్చినట్లు తింటారు. తరువాత సీన్లో ప్రెసిడెంట్ ను భూషణం పొగుడుతుంటాడు. అలాగే చిత్రను కసిరాజుకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. ఇదే విషయాన్ని బ్రహ్మం చెప్తున్నట్లు అంటాడు. అయితే పెళ్లి చాలా బంధోబస్తుతో చేయాలని చెప్తాడు. మరో సీన్లో భార్యను పిలిచి కసిరాజుతో చిత్రపెళ్లి అని ప్రెసిడెంట్ చెప్తాడు. చిత్ర నాకు వద్దు అనగానే తల్లిని కొడుతాడు. దాంతో చిత్ర ఏడుస్తుంది. తన అమ్మతో ఏడుస్తుంటే వాళ్ల అమ్మ స్త్రీ గురించి చెబుతుంది. ఆడాదాని బతుకు బంగారం పంజరంలో చిలుకలాంటిది అని చెప్తుంది. అన్ని అలవాటు అయిపోతాయి అని ఏడుస్తుంది. అలా చిత్ర కూడా ఏడుస్తుంది.
మరో సీన్లో కసిరాజు తన సత్యావతితో ఉండగా చిత్ర ఫ్రెండ్ సిరి ఫోన్ చేస్తుంది. ఇక్కడ సిరి కసిరాజు లవర్స్ అని తెలుస్తుంది. మరో వైపు శివ తాగుతూ ఆలోచిస్తాడు. అక్కడికి తాగుబోతు రాజమౌళి వచ్చి స్టఫ్ గురించి అడుగుతాడు. అంతలో శివకు ఫోన్ వస్తుంది. రాజమౌళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి కసిరాజు మాట్లాడుతాడు. చిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్లు, తనతో ఫస్ట్ నైట్ చేసుకోబోతున్నట్లు ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు. దాంతో కోపంతో రాజమౌళిని ఎక్కించుకొని బైక్ ఫాస్ట్ గా నడుపుతాడు. తరువాత గోదాట్లోకి దూకుతాడు. ఆదే సమయంలో బల్లెం కోసం వెతుకుతున్న పిల్లలకు సిలువ శివలింగం రెండు దోరుకుతాయి. వాటిని ఒక చోట దాచిపెడుతారు పిల్లలు.
తరువాత సీన్లో శివ బెదురులంకలోకి వచ్చి కాపాలా ఉన్న అందరిని కొడుతూ ఊర్లోకి ఎంటర్ అవుతాడు. నేరుగా చిత్ర ఇంటికి వెళ్లి డోర్ కొడుతాడు. చిత్ర చూసి డోర్ వేస్తుంది. అదేసమయంలో డెనియల్ శివ ఊర్లోకి వచ్చిన విషయాన్ని మైక్ లో చెబుతాడు. కట్ చేస్తే చిత్ర బ్యాగ్ తో వస్తుంది. గోడదూకగానే కసిరాజు చిత్రను పట్టుకుంటాడు. తన మనుషులను చిత్తక్కొడుతాడు శివ. ఊరంతా లాంతర్ల పట్టుకొని శివకోసం వెతుకుతూ వస్తారు. అదే సమయంలో కసిరాజు చిత్రను తీసుకొని వెళ్లి ప్రెసిడెంట్ కు అప్పజెప్తాడు.
నెక్ట్స్ సీన్లో కసిరాజు మనుషులు శివను వెతుకుతూ వస్తారు. భయపడిపారిపోయాడని కసిరాజు మీసం మెలేసి వెళ్తాడు. కట్ చేస్తే శిత అక్కడే ఉంటాడు. టీవీలో గెటప్ శీను యుగాంతం గురించి చెప్తుంటాడు. అదే సమయంలో శివకు ఎల్ బీ శ్రీరామ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఒక వైపు గెటప్ శ్రీను యుగాంతం గురించి మాట్లాడుతుంటాడు. అదే సమయంలో శివకు ఒక ఆలోచన వస్తుంది. దాంతో తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఇక ప్లాన్ చెప్పి రమ్మంటాడు. తనతో ఒక ప్లాన్ చేస్తాడు. ఊర్లో బాంబ్ పెట్టాలని ఫిక్స్ అవుతాడు. అలా కొన్ని చోట్ల బాంబులు ఫిక్స్ చేస్తాడు. వెన్నెల కిశోర్ ను ఎత్తుకొస్తారు. అతనికి కూడా తమ ప్లాన్ గురించి చెప్తాడు. దానికి అతను చేయను అనేసరికి, తనకు సినిమాలు అంటే ఇష్టమని చెప్తాడు. తన వీక్ నెస్ పాయింట్ తో కన్విన్స్ చేసీ న్యూస్ రీడర్ గా ఒప్పిస్తారు.
2012 డిసెంబర్ 12 యుగాంతం డేట్ వచ్చేసింది అని గెటప్ శ్రీను టీవీ 777 లో చెప్తుంటాడు. మరో వైపు కసిరాజు పెళ్లికి రెడీ అవుతాడు. హీరోయిన్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే కట్ చేసి పెళ్లి పీఠల మీద కూర్చుంటాడు. అక్కడ అందరూ యుగాంతం ఆగిపోయిందని మాట్లాడుకుంటారు. అక్కడికి బ్రహ్మం వస్తాడు. యుగాంతం ఆగిపోయిందని చెప్తాడు. ముత్యం సంతకం పెట్టమని అడుగుతుంటాడు. మరో వైపు హీరోయిన్ ఫ్రెండ్ బావిలో దూకాలని ట్రై చేస్తుంది. ముహుర్తం టైమ్ అయిందని తాళి కట్టబోతుండగా పెద్ద సౌండ్ వస్తుంది. ఏదో అనుకొని మళ్లీ తాళి కట్టబోతుంటే ఈ సారి ఇంకా పెద్దగా సౌండ్ వస్తుంది. దాంతో అందరూ భయపడి పరుగెడుతారు. బాంబులు పేలుతుంటాయి. అందరూ భయపడి పరుగెడతుంటారు. అంతలో ఊర్లో కేబుల్స్ కన్న కట్ చేయిస్తాడు. వెన్నెల కిశోర్ న్యూస్ చెప్తూ యుగాంతం మొదలైంది అని చెప్తాడు. అందరూ భయపడుతుంటారు. పెళ్లికూతురు గెటప్ లో చిత్ర మండపంలో ఒక్కర్తే కూర్చొని ఉంటుంది. అక్కడి శివ వచ్చి తనకు జరిగింది అంతా చెప్తాడు. తరువాత ఊర్లో నుంచి అందరూ పారిపోవాలని అనుకుంటారు. అదే సమయంలో అందరూ గోదారి దగ్గరికి పరుగెడుతుంటే హీరోకు ఒక ఆలోచన వస్తుంది. భూషణం పడవపైన వేరే ఊరికి వెళ్లాలని వెళ్తుంటే శివ వచ్చి మనఊరే బెటర్ అని చెప్తాడు. దాంతో భూషణం తిరిగి వస్తాడు.
ఇక ఊర్లో అన్ని వింతలు జరుగుతాయి. దాంతో ఊరంతా భయపడుతుంటారు. తరువాత సీన్లో శివ గోదాట్లోనుంచి ఈతకొట్టుకుంటు వస్తాడు. తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటానిన అందరితో చెప్పి దేవుడిని మొక్కుతాడు. యుగాంతం ఆగిపోతుంది అని మొక్కగానే ఇంకో బాంబ్ పేలుతుంది. దాంతో దీనికి ఇంకో పరిష్కారం ఉందని బ్రహ్మం ఆత్మలింగం తీయాలని ప్లాన్ చేస్తాడు. కట్ చేస్తే బ్రహ్మం కాంతం దగ్గర ప్రాదేయపడుతుంటాడు. అక్కిడికి శివ మనుషులతో వస్తాడు. బ్రహ్మం పారిపోతుంటాడు. తరువత సీన్లో డెవిడ్ పై ప్లాన్ చేస్తారు. డేనియల్ సిలువ మోస్తుంటే శివ కొడుతుంటాడు. అలాగే బ్రహ్మంకు కూడా చుక్కలు చూపిస్తాడు శివ. తరువాత బ్రహ్మం, డేనియల్ ఇద్దరు పారిపోతుంటారు.
తరువాత కసిరాజు డిష్ వాడుతున్నాడు అని అతని కేబుల్ తీసి కసిరాజును బెదిరించి వెళ్తాడు శివ. తరువాత కసిరాజు మందేసి సావిత్రితో గొడవపడుతుంటాడు. మధ్యలో అడ్డొచ్చిన తండ్రి భూషణ్ తో ఇష్టం వచ్చినట్లు తిట్టి. అతని విగ్గు తీసి నానా రచ్చ చేస్తాడు. అక్కడి నుంచి ప్రెసిడెంట్ దగ్గరకు వేళ్తాడు కసిరాజు. అక్కడి వెళ్లి నానా హంగామా చేస్తాడు. ప్రెసిడెంట్ ఇంటికి వెళ్లి అతని తాతాల, ముత్తాతా ఫోటోలను కట్ చేస్తాడు. తరువాత సీన్లో సిరిని క్షమించమని ప్రాదేయపడుతాడు. తరువాత కసిరాజు మాట్లాడుతాడు. అది చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అదే సమయంలో పంతులు ఎల్బీశ్రీరామ్ అందరికి మనిషీలో ఉన్న అహం తీసేస్తే మనిషి సంతోషంగా ఉంటాడు అని చెప్తాడు. వాడిలాగా ముసుగు తీసి మనిషాల బతకండి అని చెప్తాడు. తరువాత సీన్లో బ్రహ్మం, డెనియల్ ఇద్దరు వచ్చి తప్పు ఒప్పుకుంటారు. అదే సమయంలో భూషణం కూడా నిజం చెప్తాడు. అందరిని క్షమించండి అని అడుగుతాడు. కాంతంను పిలిచి తనను పెళ్లి చేసుకుంటాడు. ముగవాడు అయిన సుబ్బును కొడుకుగా అంగీకరిస్తాడు. అదేసమయంలో ఒక్కొక్కరు నిజాలు చెప్పుకుంటారు. అందరూ నిజాలు చెప్తుంటే ఊరంతా ఆశ్చర్యపోతారు. బంగారం ఇవ్వకుండా ప్రజలు కూడా మోసం చేసినట్లు చూసి షాక్ అవుతారు.
చదవండి:Anirudh ‘లియో’ ఫస్ట్ రివ్యూ.. మామూలుగా లేదుగా!
రెండు రింగులు ఇవ్వనందుకే నన్ను ఊరినుంచి వెళ్లగొట్టారు మీరు ఇంత బంగారం దాచుకున్నారా అని శివ అందరిని తిడుతుంటాడు. ఇకనైన అందరూ హ్యప్పిగా ఉండండి అని అంటాడు. అందరు సాంగ్ పాడుకుంటారు. నిజమైన మనుషుల్లా ఎలాంటి ముసుగు లేకుంటా ప్రవర్తిస్తుంటారు. అందరూ ఒక ట్రాన్స్ లో చిందేస్తుంటారు. సాంగ్ అయిపోతుంది. తెల్లారుతుంది. అందరూ నిద్రలోంచి లేచే సరికి ఎవరికి ఏం అర్థం కాదు. అందరూ ఆశ్చర్యపోతూ చూస్తుంటారు. కట్ చేస్తే శివ టీవీలో నైట్ జరిగింది అంతా తన ప్లానే అని చెప్తాడు. శివకు చిత్రకు పెళ్లి చేస్తున్నట్లు ప్రసిడెంట్ చెప్తాడు. అందరూ మ్యారెజీకి హాజరు అవుతారు. ఒకరి మొకాలు ఒకరు చూసుకుంటు సిగ్గుపడుతుంటారు. శివ చిత్ర పెళ్లి జరుగుతుంది. టీవీ 777 యుగాంతం లేదు అని అది మూఢనమ్మకమని ముందునుంచి చెప్తున్నట్లు గెటప్ శ్రీను చెప్తాడు.