Anil Ravipudi : ఏం అనిల్ అన్న డైరెక్షన్ వదిలేసి డ్యాన్స్ మాస్టార్ గా మారావా ?
రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి దర్శకుడిగా మారారు అనిల్ రావిపూడి. వెరైటీ టేకింగ్ తో వరుస హిట్స్ సాధిస్తూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు. అప్పటి వరకు ఓ మోస్తారు హిట్స్ కొట్టిన కళ్యాణ్ రామ్ తో `పటాస్` మూవీ చేసి భారీ విజయం అందించారు.
Anil Ravipudi : రచయిత(Writer)గా కెరీర్ స్టార్ట్ చేసి దర్శకుడిగా మారారు అనిల్ రావిపూడి(Anil Ravipudi). వెరైటీ టేకింగ్ తో వరుస హిట్స్ సాధిస్తూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు. అప్పటి వరకు ఓ మోస్తారు హిట్స్ కొట్టిన కళ్యాణ్ రామ్(Kalyan ram) తో `పటాస్`(Patas) మూవీ చేసి భారీ విజయం అందించారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత తీసిన ప్రతి సినిమా హిట్టే.. అలా అపజయం లేని డైరెక్టర్ గా నిలిచారు.
ప్రస్తుతం అనిల్ నందమూరి బాలకృష్ణ(Balakrishana)తో `ఎన్బీకే 108`(NBK 108) వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.. శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటిస్తోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి గొప్ప డైరెక్టర్ మాత్రమే కాదు మంచి డ్యాన్సర్ కూడా. గతంలో కొన్ని సార్లు ఈ విషయం రుజువు అయింది. తాజాగా మరోసారి తన టాలెంట్ ను అందరికీ చూపించాడు. షూటింగ్ సెట్స్‌లో ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్లతో కలిసి ఫేమస్ `బాలయ్యా బాలయ్యా` పాటకు అనిల్ రావిపూడి డ్యాన్స్ చేశాడు. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.