అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి (Sneha Reddy) ఈ మధ్య చేసే పోస్ట్‌లు మరింత వైరల్ అవుతున్నాయి. తను ఈ మధ్యకాలంలో ఓ కొటేషన్‌ని సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ (Instagram) షేర్ చేసింది. ఆ స్టోరీలో కొటేషన్‌కి అర్థం ఏంటంటే.. నాకు వంట చేయడం కంటే ముద్దు పెట్టుకోవడమే బాగా వచ్చు అనే అర్థం వస్తుంది..ఇక ఇది చూసిన ఫ్యాన్స్ స్నేహ మరీ ఇంత రొమాంటిక్ (Romantic) పర్సనా? అని తెగ చెవులు కొరుక్కుంటున్నారు ఆమె ఏ ఉద్దేశ్యంతో అలా పోస్ట్ చేసిందో కానీ.. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇల్లు, పిల్లల బాధ్యతలే కాకుండా స్నేహారెడ్డి బిజినెస్ (Business) పనుల్లోనూ కాస్త బిజీగానే ఉంటుంది. ఆమె గ్లామర్ ముందు హీరోయిన్లు కూడా సరిపోరంటే నమ్మాలి మరి. స్టార్ హీరోయిన్లు, హీరోల వ్యక్తిగత విషయాల గురించి కాస్త ప్రత్యేకమైన ఇంట్రస్ట్ ప్రేక్షకుల్లో ఉంటుంది. వీళ్ల తిండి నుంచి అలవాట్ల, పర్సనల్ లైఫ్ (Personal life) వరకూ తెలుసుకోవాలని ఆసక్తిగాఉంటుంది.
అయితే హీరోలు, హీరోయిన్స్ కూడా ఒకప్పటిలా మూవీస్‌కి మాత్రమే పరిమితం అయిపోకుండా సోషల్ లైఫ్‌తో పాటు, ప్రైవేట్ లైఫ్‌ని కూడా అప్పుడప్పుడూ ప్రేక్షకుల (Audience) ముందు పెడుతూ.. వాళ్లను ఎంటర్టైన్ చేస్తున్నారు.అల్లు అర్జున్ భార్యగా, అల్లువారి కోడలిగా అల్లు స్నేహారెడ్డి అందరికీ సుపరిచితమే. కోడలిగా, భార్యగా, తల్లిగా అన్ని పాత్రలూ పోషిస్తూనే సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది స్నేహ.సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ఫ్యామిలీ (Family) ముచ్చట్ల నుంచి తన ఫోటో షూట్స్, స్టైలిష్ లుక్స్ గురించి అలాగే పిల్లల విషయాలను కూడా అందులో పంచుకుంటూ ఉంటుంది. స్నేహా రెడ్డి షేర్ చేసే పోస్ట్స్కి అన్ని మీడియాలలోనూ మంచి క్రేజ్ వస్తోంది. ప్రత్యేకంగా ఫోటో షూట్స్ (Photo shoots) చేయిస్తూ తన కెరియర్ని నిలుపుకుంటూనే పిల్లల పెంపకంలోనూ బిజీగా ఉంటుంది స్నేహ.