బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతలా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి.. తాను టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇటీవల టీమిండియా యువ క్రికెటర్ పంత్ ని వివాదంలోకి లాగి.. ఆ తర్వాత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా.. ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. కాగా.. తాజాగా ఈ విషయంలో ఆమె కాస్త వెనక్కి తగ్గింది. పంత్ కి క్షమాపణలు తెలియజేసింది.
ఇంతకీ మ్యాటరేంటంటే… ఆర్పీ (RP) అనే వ్యక్తి తన కోసం ఎయిర్ పోర్టులో 16 గంటలు వెయిట్ చేశాడని ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి చెప్పడంతో.. అందరూ ఆర్పీ అంటే రిషబ్ పంత్ అనుకుని వార్తలు రాసేశారు. దీంతో వివాదం మొదలైంది. ఈ వ్యాఖ్యలకు రిషబ్ పంత్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. కొంతమంది ఫేమ్ కోసం ఎలా అబద్దాలు ఆడుతున్నారో అర్థం కావడం లేదన్నాడు. ‘ప్లీజ్ అక్కా నన్ను వదిలేయ్..’ అంటూ ఊర్వశి రౌతేలా పేరు చెప్పకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
ఈ పోస్ట్‌కు ఊర్వశి రౌతేలా ఇండైరెక్ట్‌గా రిప్లై ఇస్తూ.. రిషబ్ పంత్‌ను పిల్ల బచ్చా అని తిట్టేసింది. కౌగర్ హంటర్ అని దూషించింది. ‘చోటా భయ్యా.. నువ్వు వెళ్లి బ్యాటు, బాల్‌తో ఆడుకో.. నీలాంటి పిల్ల బచ్చాల వల్ల నేను బద్నాం అయ్యేందుకు తాను మున్నిని కాదు..’ అంటూ ఈ బ్యూటీ కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. ఆ తరువాత పంత్ పట్టించుకోలేదు.
అయితే..తాజాగా రిషబ్ పంత్‌కు సారీ చెప్పింది. ఆర్పీ కి మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా..? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘అవును ఏం చెప్పాలనుకుంటున్నానో నాకే తెలియదు. అయితే ఒక్క విషయం సారీ..’ అంటూ ఊర్వశి రౌతేలా చెప్పింది.