Actress Kiran Rathod Charge RS.14 Thousand for Video call
Kiran Rathod:సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.. అందులో హీరోయిన్లు అంటే క్రేజీ మాములుగా ఉండదు. తారల కోసం పడిచచ్చే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఒకప్పటి హీరోయిన్ కిరణ్ రాథొడ్ (Kiran Rathod) దానిని క్యాష్ చేసుకుంటున్నారు. అవును ఓ యాప్ పెట్టి రిజిస్ట్రేషన్ పేరుతో వసూల్ చేస్తున్నారు. ఆమె ఫోటోలు.. లేదంటే వీడియో కాల్ చేయాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్‌కు (Raveena tandon) కిరణ్ రాథొడ్ (Kiran Rathod) కజిన్ అవుతారు. ఆమె తమిళ్‌తోపాటు (tamil) తెలుగు (telugu), కన్నడ (kannada), మలయాళం (malayalam), హిందీ (hindi) మూవీస్ చేసింది. 2002లో వచ్చిన తమిళ్ మూవీ జెమినీలో (Gemini) హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేసింది. మూవీ హిట్ కావడంతో వరసగా విలన్, అన్బే శివమ్, విన్నర్, తెన్నవన్, ఆంబళ్ వంటి తమిళ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సైలంట్ అయ్యారు. తన ఫొటోలను ఇన్ స్టలో షేర్ చేస్తోంది.
తన పేరు ‘కిరణ్’తో (kiran) యాప్ ప్రారంభించారు. యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే రూ.49 చెల్లించాల్సిందే.. ఇంట్రెస్ట్ ఉన్నవారు డౌన్ లోడ్ చేస్తున్నారు. యాప్‌లో రూ.వెయ్యి కడితే తన రెండు గ్లామర్ ఫోటోలను (photo) పంపిస్తోంది. అంతటితో ఆగనివారు.. ఆమెతో మాట్లాడాలి అనుకునే వారికి కాల్ (call), వీడియో కాల్ (video call) చేసేందుకు అవకాశం కల్పించింది.
5 నిమిషాలు కాల్ మాట్లాడితే రూ.10 వేలు (10 thousand) ఛార్జీ చేస్తుంది. ఆమెను చూస్తూ లైవ్‌లో మాట్లాడే అవకాశం కూడా ఇచ్చింది. 15 నిమిషాలు (15 minutes) మాట్లాడితే రూ.14 వేలు తీసుకుంటుంది. ఇంక ఇంట్రెస్ట్ ఉన్న వారు 25 నిమిషాలకు (25 minutes) రూ.25 వేలు చెల్లించాలని చెబుతోంది. దీనికి సంబంధించి ధైర్యం గలవారే చరిత్ర సృష్టించగలరని ఇన్ స్టలో కామెంట్ చేసింది. దీనిని కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు.
కిరణ్ రాథొడ్తో (Kiran Rathod) మాట్లాడాలి అనుకునే వారు తప్పకుండా కాల్ చేస్తారు. అందుకు వేలు ఖర్చు చేయడానికి వెనుకాడరు. ఆమె వారితో ఏ విషయాలు మాట్లాడతారు..? ఫ్యాన్స్ ఏ అంశాలు డిస్కష్ చేస్తారో తెలియదు. దీనికి సంబంధించి అభిమానులతో మాట్లాడేందుకు చార్జీ వసూల్ చేస్తావా అని కొందరు విమర్శిస్తున్నారు. ఆ విషయాలను మాత్రం కిరణ్ (kiran) చెవికెక్కించుకోవడం లేదు.