»Aap Mp Raghav Chadha Pens Note On How Parineeti Chopra Changed His Life
Heroine పరిణీతి రాకతో నా జీవితం మారిపోయింది.. రాఘవ్ చద్దా
తన ప్రయాణాన్ని పరిణీతి రంగులమయంగా మార్చిందని.. ఎన్నో నవ్వుల్ని, సంతోషాల్ని తెచ్చిందన్నారు. తమ నిశ్చితార్థం ఎంతో సంతోషకరంగా జరిగిపోయిందని, అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు.
బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల నిశ్చితార్థం (Engagement) చేసుకోగా.. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను తాజాగా రాఘవ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన పరిణీతిపై ప్రశంసలు కురిపించాడు.
ఒక మంచి రోజు ఆ అందమైన అమ్మాయి (Girl) తన జీవితంలోకి వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి తన జీవితమే (Life) మారిపోయిందన్నారు. తన ప్రయాణాన్ని పరిణీతి రంగులమయంగా (Colourful) మార్చిందని.. ఎన్నో నవ్వుల్ని, సంతోషాల్ని తెచ్చిందన్నారు. తమ నిశ్చితార్థం ఎంతో సంతోషకరంగా జరిగిపోయిందని, అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. ఆనంద బాష్పాలు, చిరునవ్వులు (Smiles), సంతోషాలు, డ్యాన్సులతో (Dance) నిండిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుక తమ ప్రియమైన వారిని మరింత దగ్గర చేసిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
ఢిల్లీలోని రాజీవ్ చౌక్‌లో గల కపుర్తాల హౌస్‌లో (Kapurthala House) పరిణీతి, రాఘవ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, చిత్ర పరిశ్రమలోని సహచరులు హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పరిణీతి సోదరి ప్రియాంకా చోప్రా తదితరులు హాజరై కాబోయే కొత్త జంటను ఆశీర్వదించారు.